Site icon NTV Telugu

CP Sajjanar: ‘క్యాబ్’ ఎక్కుతారా.. ‘కోర్టు’ మెట్లెక్కుతారా?.. మందుబాబులకు పోలీసుల నయా ‘క్లాస్’

Cp Sajjanar

Cp Sajjanar

వరల్డ్ వైడ్ గా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు సోషల్ మీడియా వేదికగా వినూత్న ప్రచారానికి తెరలేపారు. హైద‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌ర్ సజ్జనార్ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేసిన మూడు వేర్వేరు ట్వీట్లు ఇప్పుడు మందుబాబుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి. ‘లాయర్’ను వెతకడం కంటే.. గూగుల్‌లో ‘క్యాబ్’ను వెతకడం మిన్న! అంటూ.. సాధారణ హెచ్చరికలకు భిన్నంగా, పక్కా హైదరాబాదీ యాసలో సీపీ స‌జ్జనార్ ట్వీట్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది.

Also Read:Dhurandhar: వసూళ్లలో “కల్కి” రికార్డు బద్దలు గొట్టిన ధురంధర్.. నెక్ట్స్ టార్గెట్ పుష్ప-2..

“మియా.. డ్రింక్ చేశావా? అయితే స్టీరింగ్‌కు సలాం కొట్టి క్యాబ్ ఎక్కు” అంటూ స్నేహపూర్వకంగా చెబుతూనే.. “గూగుల్‌లో లాయర్ కోసం వెతకడం కంటే, క్యాబ్ కోసం వెతకడం మంచిది” అంటూ ట్వీట్ చేశారు. చలాన్లు, జైలు శిక్షలకు అయ్యే ఖర్చుతో పోలిస్తే క్యాబ్ ఖర్చు చాలా తక్కువని, సంబరాలను బాధ్యతయుతంగా జరుపుకోవాలని హితవు పలికారు. లేదంటే ‘యాక్షన్ గ్యారెంటీ’ అని తేల్చిచెప్పారు. ‘మా డాడీ ఎవరో తెలుసా?’ అంటే.. ఇక కుదరదు! అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.

Also Read:LIC New Jeevan Shanti Plan: ఎల్ఐసీ బెస్ట్ ప్లాన్.. ఒకసారి పెట్టుబడి పెడితే చాలు.. జీవితాంతం రూ.లక్ష పెన్షన్ పొందే ఛాన్స్!

డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడగానే “మా డాడీ ఎవరో తెలుసా? మా అంకుల్ ఎవరో తెలుసా?” అంటూ పరపతిని వాడే ప్రయత్నం చేస్తుంటారు. దీనికి సీపీ సజ్జనార్ తనదైన శైలిలో చెక్ పెట్టారు. “మీ పరపతి గురించి మా ఆఫీసర్లను అడగొద్దు.. మీ ప్రైవసీని మేము గౌరవిస్తాం.. వాహనం పక్కన పెట్టి, డేట్ వచ్చాక కోర్టులోనే పరిచయం చేసుకుందాం” అంటూ ట్వీట్ చేశారు.

Exit mobile version