NTV Telugu Site icon

Hyderabad: సంధ్య థియేటర్ ఘటనపై పోలీసులు సంచలన వీడియో విడుదల..

Allu Arjun Case

Allu Arjun Case

సంధ్య థియేటర్ ఘటనపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఓ వీడియోను విడుదల చేశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సీవీ ఆనంద్.. చిక్కడపల్లి ఏసీపీ రమేశ్, సీఐ రాజు నాయక్ వివరణ ఇచ్చారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనను వివరించారు. సంధ్య థియేటర్‌ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. కేసులో న్యాయపరమైన సలహాలు తీసుకుని ముందుకెళ్తామన్నారు. అల్లు అర్జున్ వద్దకు వెళ్లేందుకు ఎస్‌హెచ్‌వో కూడా తీవ్రంగా కష్టపడాల్సి వచ్చిందని సీపీ పేర్కొన్నారు. విశ్వ ప్రయత్నాలు చేసిన తర్వాత కానీ.. అల్లు అర్జున్ బయటకు రాలేదని సీపీ తెలిపారు.

Allu Arjun: 2 వేల కోట్లు కలెక్ట్ చేశారు.. బాధిత కుటుంబానికి రూ.20 కోట్లు ఇస్తే పోయేదేముంది: మంత్రి

ఏసీపీ రమేష్ మాట్లాడుతూ.. బయట తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోయింది అనే విషయాన్ని అల్లు అర్జున్‌కి చెప్పేందుకు వెళ్తుండగా.. మేనేజర్ నేను చెప్తాను అన్నాడని అన్నారు. దయచేసి వెళ్ళండని అల్లు అర్జున్‌కు డీసీపీ నేరుగా వెళ్లి చెప్పారన్నారు. కానీ నేను సినిమా మొత్తం చూసిన తర్వాతే వెళ్తాను అని అల్లు అర్జున్ అన్నారన్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట విషయం అల్లు అర్జున్ దృష్టికి తాను తీసుకువెళ్లానన్నారు. ఓ మహిళ చనిపోయింది.. బాబు సీరియస్ ఉన్నాడని అల్లు అర్జున్‌కు చెవిలో చెప్పాను.. నేను సినిమా చూశాకే వెళ్తాను అని అల్లు అర్జున్ తనకు చెప్పాడని అన్నారు. చిక్కడపల్లి సీఐ, రాజు నాయక్ మాట్లాడుతూ.. రేవతిని, చిన్న బాబు తేజను కాపాడేందుకు ఎంతో ప్రయత్నించానని అన్నారు. ఎస్సై మౌనిక, తాను రేవతికి సీపీఆర్ చేశాం.. కాపాడేందుకు ప్రయత్నించామని చెప్పారు. కానీ తమ ముందే రేవతి ప్రాణాలు పోయాయని తెలిపారు. తొక్కిసలాటలో తన ప్రాణాలు కూడా పోయేవని సీఐ అన్నారు.

Abhijeet : “గాంధీ పాకిస్థాన్ కి పితామహుడు.. భారత్‌కి కాదు.” సింగర్ సంచలన వ్యాఖ్యలు

సీపీ వార్నింగ్:
సీపీ సీవీ ఆనంద్ బౌన్సర్లకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. పబ్లిక్‌ను ఎక్కడైనా తోసివేస్తే తాట తీస్తామని అన్నారు. బౌన్సర్ల తీరుకు సెలబ్రిటీనే భాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పారు. బౌన్సర్లను పెట్టుకున్న వాళ్ళదే పూర్తి బాధ్యత అని సీపీ పేర్కొన్నారు.