NTV Telugu Site icon

Cow Urine Research : షాకింగ్ .. ఆవు మూత్రంలో హానికర బ్యాక్టీరియా

Cow Urine

Cow Urine

Cow Urine Research : ఆయుర్వేదం ప్రకారం కొన్ని వ్యాధుల నివారణకు గోమూత్రం తీసుకోవడం ప్రయోజనకరమని సూచించాయి. కానీ ఇటీవల నిర్వహించిన పరిశోధనల్లో ఆవు మూత్రం తీసుకోవడం మానవులకు మంచిది కాదని స్పష్టమైంది. దేశంలోని ప్రముఖ జంతు పరిశోధనా సంస్థ ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం బరేలీలోని ఐసీఏఆర్-ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (IVRI)లో నిర్వహించిన పరిశోధనలో కొన్ని బ్యాక్టీరియాలకు వ్యతిరేకంగా గేదె మూత్రం మరింత ప్రభావవంతంగా పనిచేస్తుందని తేలింది.

మన దేశంలో ఆవులను పూజిస్తారు. ఆవు ప్రాముఖ్యతను చెప్పడానికి.. జంతువుగా ఆవు ఎంత ఉపయోగకరంగా ఉంటుందో నొక్కి చెప్పడానికి నిరంతరం ప్రయత్నాలు జరుగుతునే ఉన్నాయి. అదేవిధంగా గోమూత్రం ఎంత మేలు చేస్తుందో ఎప్పుడూ చెబుతుంటారు. హిందూ సంస్కృతిలో గోమూత్రం చాలా పవిత్రమైనది. దీనిని అనేక శుభ కార్యాలలో ఉపయోగిస్తుంటారు. ఆవు మూత్రం అనేక వ్యాధులకు ఔషధంగా త్రాగడానికి ఇవ్వబడుతుంది. అయితే తాజాగా జరిగిన పరిశోధనల్లో గోమూత్రంలో ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఉన్నట్లు తేలింది. ఈ బ్యాక్టీరియా మానవులకు ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు.

Read Also: Urinate : మగాళ్లు జాగ్రత్త.. నిలబడి మూత్రం పోయొద్దంట

ఆసక్తికరమైన విషయమేమిటంటే.. భారత ఆహార భద్రత, ప్రమాణాల అథారిటీ (FSSAI) ట్రేడ్‌మార్క్ లేకుండా ఆవు మూత్రాన్ని భారత మార్కెట్లో చాలా మంది విస్తృతంగా విక్రయిస్తున్నారు. బరేలీలోని ఐసీఏఆర్-ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (IVRI)లో భోజరాజ్ సింగ్ నేతృత్వంలో ముగ్గురు పీహెచ్‌డీ విద్యార్థులు గోమూత్రాన్ని మనుషులపై వినియోగించడంపై పరిశోధనలు చేశారు. ఆరోగ్యవంతమైన ఆవులు, ఎద్దుల మూత్రం నమూనాలలో కనీసం 14 రకాల హానికరమైన బాక్టీరియాలు ఉన్నట్లు తేలింది. వీటిలో ఎస్చెరిచియా కోలి.. బ్యాక్టీరియా కడుపు ఇన్ఫెక్షన్లకు కారణమవుతుందని పరిశోధన పేర్కొంది.

ఈ పరిశోధన ఫలితాలు రీసెర్చ్‌గేట్ అనే ఆన్‌లైన్ రీసెర్చ్ వెబ్‌సైట్‌లో ప్రచురించబడ్డాయి. ఇన్‌స్టిట్యూట్‌లోని ఎపిడెమియాలజీ విభాగానికి అధిపతిగా ఉన్న సింగ్, ఆవులు, గేదెలు, మానవుల నుండి 73 మూత్ర నమూనాల గణాంక విశ్లేషణలో గేదె మూత్రంలోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఆవుల కంటే మెరుగ్గా ఉన్నాయని తేలింది. గేదె మూత్రం S. ఎపిడెర్మిడిస్, E. రాపోంటిసి వంటి సూక్ష్మక్రిములపై ​బలమైన ప్రభావాన్ని చూపుతుంది.

Show comments