Site icon NTV Telugu

Cow in Hospital ICU: ఐసీయూలో చేరిన ఆవు.. ఆస్పత్రి డాక్టర్లు ఏం చేశారంటే

Cow

Cow

Cow in Hospital ICU: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణ స్థితికి ప్రభుత్వ ఆస్పత్రులు చేరుకున్నాయి. అక్కడ డాక్టర్లు సమయానికి రారు, సిబ్బంది అందుబాటులో ఉండరు, వైద్య సేవల గురించి, వసతుల గురించి ఎవరిని అడిగినా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా రాజ్ గఢ్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలోకి ఆవు ప్రవేశించింది. ఆ ఆవును బయటికి పంపేవారు ఎవరూ లేకపోవడంతో.. అది ఆస్పత్రిలోని ఐసీయూ వార్డుల్లో స్వేచ్ఛగా విహరించింది. అవస్థలు పడుతున్న రోగులున్న ప్రదేశాల్లో తిరిగింది. అది గమనించిన స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై నెట్టింట చర్చ జరుగుతోంది.

Read Also: Disha Patani New Boyriend: ‘టైగర్’ కుళ్లుకునేలా సెల్ఫీలు.. రెచ్చిపోయిన బాలీవుడ్ భామ

ఆసుపత్రి ఐసీయూ వార్డులోకి ఆవు వచ్చే వరకూ సిబ్బంది ఏం చేస్తున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు. ఆ వీడియో చూసి ఉన్నతాధికారులు, ఆరోగ్య శాఖ సిబ్బంది కూడా అవాక్కయ్యారు. వెంటనే సీనియర్ హెల్త్ డిపార్ట్‌మెంట్ అధికారులు రంగంలోకి దిగారు. జరిగిన ఘటనపై చర్యలు తీసుకున్నారు. ఆస్పత్రిలో పని చేసే ఒక సెక్యూరిటీ గార్డుతో సహా ముగ్గురు సిబ్బందిని విధుల నుంచి తొలగించారు. అంతేకాదు, సెక్యూరిటీ ఏజెన్సీకి నోటీసులు కూడా జారీ చేశారు. దీనిపై జిల్లా ఆసుపత్రి సివిల్ సర్జన్ స్పందించారు. అది పాత కోవిడ్ ఐసీయూ వార్డు అని ఆయన తెలిపారు.

Exit mobile version