NTV Telugu Site icon

Asia Cup 2023 : ఆసియాక‌ప్ ఆరంభానికి ముందు క‌రోనా ముప్పు..?

Asia Cup

Asia Cup

క్రికెట్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఆసియా కప్ ఆగస్ట్ 30 నుంరి ఆరంభం కానుంది. హైబ్రిడ్ మోడల్ లో జరుగనున్న ఈ మెగా ఈవెంట్ కి పాకిస్థాన్, శ్రీలంకలు ఆతిథ్యం ఇస్తున్నాయి. మరో నాలుగు రోజుల్లో ఈ టోర్నమెంట్ స్టార్ట్ కానుంది. కానీ, ఇప్పుడు కరోనా టెన్షన్ నెలకొంది. శ్రీలంకకు చెందిన ఇద్దరు కీ ప్లేయర్స్ కొవిడ్ బారిన పడ్డారు. దీంతో వారిద్దరిని ఐసోలేషన్ లోకి పంపించారు. ఆగ‌స్టు 31న‌ శ్రీలంక జ‌ట్టు బంగ్లాదేశ్‌తో పోటీ పడనుంది. ఈ మ్యాచ్ టైంకి కోలుకుని నెగెటివ్‌ వస్తే.. వాళ్లు బ‌రిలోకి దిగ‌నున్నారు.

Read Also: Peddireddy Ramachandra Reddy: నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు.. ఈసారి గతంకంటే ఎక్కువ సీట్లు..!

ఆ ఇద్దరు ప్లేయర్స్ ఎవరో కాదు.. అవిష్క ఫెర్నాండో, ఓపెనింగ్ బ్యాటర్ కుశాల్ పెరెరాలు. ఈ ప్లేయర్స్ ప్రస్తుతం శ్రీలంక వ‌న్డే జ‌ట్టులో కీల‌కంగా ఉన్నారు. ఇటీవ‌ల నిర్వహించిన లంక ప్రీమియ‌ర్ లీగ్ ముగిసే టైంలో వీరు క‌రోనా బారిన ప‌డిన‌ట్లు పలు నివేదిక‌లు చెబుతున్నాయి. ఈ విష‌యం తెలిసిన క్రికెట్ ఫ్యాన్స్ కంగారు ప‌డుతున్నారు. ఆసియా క‌ప్‌లో పాల్గొనే ప్లేయర్స్ కు కరోనా సోకకుండా క‌ట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు లంక బోర్డును కోరుతున్నారు.

Read Also: Dress code: ఆ దేవాలయానికి వెళ్లాలంటే ‘డ్రెస్ కోడ్’ ఉండాలంటా.. లేదంటే నో ఎంట్రీ

అయితే, ఆసియా క‌ప్‌లో టీమిండియా ఆడే మ్యాచ్ లన్నీ శ్రీలంక వేదిక‌గా జ‌ర‌ుగ‌నున్నాయి. ఇక, ఈ టోర్నీ ముగిసిన త‌రువాత భార‌త జ‌ట్టు ఆస్ట్రేలియాతో వ‌న్డే సిరీస్ ఆడ‌నుంది. ఆ త‌రువాత వ‌న్డే వరల్డ్ కప్ బరిలోకి దిగుతుంది. ఇప్పటికే భారత జట్టు ప్లేయర్లు గాయాలతో ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు కీల‌క ఆట‌గాళ్లు క‌రోనా బారిన ప‌డి కీలక మ్యాచ్ లకు దూరమైతే.. జ‌ట్టు ఆట‌తీరుపై ప్రభావం చూపుతుంది. గ‌తంలో మాదిరిగా ప్రస్తుతం కరోనా తీవ్రత అంత అధికంగా లేదు. అయినప్పటికీ పాజిటివ్‌గా నిర్థార‌ణ అయితే మాత్రం ఐసోలేష‌న్‌లో ఉండాల్సిందే. బ‌యోబ‌బుల్ ఏర్పాటు చేయాల్సిన అవ‌స‌రం అయితే లేదు గానీ ఖ‌చ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని వైద్యారోగ్య నిపుణులు చెబుతున్నారు. గ్రౌండ్లు, పెవిలియన్ దగ్గర శానిటైజేష‌న్ చేయాల్సి అవ‌స‌రం ఉందని తెలిపారు.

Read Also: Wanindu Hasaranga: చెల్లి పెళ్లిలో.. కన్నీరు పెట్టుకున్న ఆ స్టార్‌ క్రికెటర్‌

ఈ మెగా టోర్నీలో శ్రీలంక ఆగస్ట్‌ 31న తమ తొలి మ్యాచ్‌ను బంగ్లాదేశ్‌తో ఆడనుంది. పల్లెకెలెలో ఈ మ్యాచ్‌ జరుగనుంది. మరోవైపు ఇదే టోర్నీలో భారత్‌-పాక్‌ మ్యాచ్‌ సెప్టెంబర్‌ 2న జరగనుంది. ఈ మ్యాచ్‌ కూడా పల్లెకెలె గ్రౌండే ఆతిథ్యమివ్వనుంది. అనంతరం సెప్టెంబర్‌ 4 భారత్‌.. నేపాల్‌తో మ్యాచ్‌ ఆడనుంది. భారత్‌, శ్రీలంకలు వేర్వేరు గ్రూప్‌ల్లో ఉండటంతో స్టేజీ-1లో తలపడే ఛాన్స్ లేదు. సెప్టెంబర్‌ 17న జరిగే ఫైనల్‌తో ఆసియాకప్‌ క్లోజ్ అవుతుంది. అనంతరం అక్టోబర్‌, నవంబర్‌ నెలల్లో వన్డే వరల్డ్‌కప్‌ స్టార్ట్ కానుంది.