ఇటీవల జరిగిన పదో తరగతి పరీక్షల్లో హిందీ ప్రశ్నాపత్రం లీక్ కేసులో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ కేసులో అరెస్టైన బండి సంజయ్ ప్రస్తుతం బెయిల్‌పై బయటకు వచ్చారు. ఈ క్రమంలో తాజాగా.. పదో తరగతి హిందీ ప్రశ్నా పత్రం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బండి సంజయ్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ స్పెషల్ పీపీ సత్యనారాయణ పిటిషన్ దాఖలు చేశారు.
Also Read : Atiq Ahmed’s Killers: మరో జైలుకు గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ హంతకులు
హనుమకొండలోని 4వ ఎంఎం కోర్టులో ప్రభుత్వం తరుపున స్పెషల్ పీపీ వాదనలు వినిపించారు. బండి సంజయ్ పోలీసు విచారణకు సహకరించడం లేదని, పిటిషన్ లో పేర్కొన్న ప్రాసిక్యూషన్… ఈ కేసులో నిందితులు A-6 A-9కు బెయిల్ పై వాదనలు ముగిసినట్లు వెల్లడించింది. అయితే.. వాదనలు విన్న కోర్టు నిర్ణయం రేపటికి వాయిదా వేసింది. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ బెయిల్ రద్దు చేయాలని ప్రభుత్వ వేసిన పిటిషన్ ను హనుమకొండ జిల్లా కోర్టు తిరస్కరించింది. జిల్లా కోర్టు సూచన మేరకు ఫోర్త్ ఎం ఎం కోర్టులో మళ్ళీ పిటిషన్ వేశారు ప్రభుత్వం లాయర్. దీంతో కోర్టు విచారణ చేపట్టింది.
Also Read : MP Avinash Reddy : కడప ఎంపీ అవినాష్ రెడ్డి నేటి విచారణ వాయిదా.. రేపు రావాలని సీబీఐ నోటీసులు