Site icon NTV Telugu

Chahal-Dhanashree: చాహల్, ధనశ్రీ వర్మల వివాహబంధానికి తెర.. కోర్టు విడాకులు మంజూరు

Chahal

Chahal

టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మల వివాహ బంధానికి ఎండ్ కార్డ్ పడింది. వీరికి ముంబైలోని ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. విడాకుల పిటిషన్ కోసం మధ్యాహ్నం బాంద్రా ఫ్యామిలీ కోర్టుకు వచ్చిన వీరికి.. కోర్టు విడాకులు మంజూరు చేసింది.

Read Also: Disha Salian: “దిశా సాలియన్‌”పై గ్యాంగ్ రేప్.. “ఆదిత్య ఠాక్రే”పై విచారణ కోరుతూ తండ్రి పిటిషన్..

యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ 2020లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. కానీ కొన్నాళ్లుగా వారిద్దరి మధ్య విభేదాలు పెరిగాయని.. ఆ కారణంగా విడాకుల కోసం ఫిబ్రవరి 5, 2025న ముంబై ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించినట్టు సమాచారం. పరస్పర అంగీకారంతో విడాకుల పిటిషన్ దాఖలు చేశారు. విడాకుల ఒప్పందం ప్రకారం.. చాహల్ ధనశ్రీకి రూ. 4.75 కోట్లు భరణంగా చెల్లించేందుకు చాహల్ అంగీకరించారు. ఈ మొత్తంలో ఇందులో ఇప్పటికే రూ. 2.37 కోట్లు చెల్లించాడు. మిగిలిన మొత్తం కోర్టు తీర్పు అనంతరం చెల్లించనున్నాడు. ఈ భరణం గురించి సమాచారం లభించినప్పటికీ, దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.

Read Also: Vaishnavi Chaitanya: ఎస్కేఎన్ ఎవరి గురించి అన్నారో మరి!

వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.. అందులో భాగంగానే చాహల్, ధనశ్రీ తమ సోషల్ మీడియా ఖాతాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం, ఇద్దరూ తమ సోషల్ మీడియా అకౌంట్లలో తమదైన శైలిలో పోస్టులు పెట్టడంతో విడాకుల పుకార్లు మరింత వ్యాపించాయి. తాజాగా యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మల విడాకులకు కోర్టు ఆమోదం తెలిపింది .

Exit mobile version