NTV Telugu Site icon

Car Romance: కామా తురాణం.. కదులుతున్న కారులోనే రొమాన్స్

Lucknow Couple

Lucknow Couple

Car Romance: ప్రకృతి వైపరీత్యమో.. మీడియా ప్రభావమో తెలియదు కానీ యూత్ ఈ మధ్య తెగరెచ్చిపోతున్నారు. మొన్నటి వరకు పార్కుల్లోనో చెట్ల పొదల్లోనో గుట్టు చప్పుడు కాకుండా రొమాన్స్ చేసుకునే జంటలు.. ఇప్పుడు హద్దు మీరుతున్నారు. బహిరంగంగా ఎంతమందిలో ఉన్నాము.. అన్నది చూసుకోకుండా అడ్డగోలుగా బీహేవ్ చేస్తున్నారు. వయసుకొచ్చే సరికి మమ్మల్ని ఆపేవారు లేరన్నట్లు ప్రవర్తిస్తున్నారు. నడిరోడ్లపై రొమాన్స్ చేస్తూ అదేదో ఫ్యాషన్ అన్నట్లు హద్దులు దాటేస్తున్నారు. ఒక్కోసారి దొరికిపోయి తల్లిదండ్రుల పరువు తీస్తున్నారు. ఆ మధ్య రోడ్డుపై వెళ్తూ బైక్ పై రొమాన్స్ చేసుకుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతానికి కూడా అలాంటి వీడియో ఒకటి ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. కారులో ప్రయాణిస్తున్న ఓ జంట.. వాహనానికి ఉన్న సన్ రూఫ్ ఓపెన్ చేసి.. అందులో నుంచి బయటకు వచ్చి రొమాన్స్ చేయడం స్టార్ట్ చేశారు. వైరల్ క్లిప్‌ను ప్రియా సింగ్ అనే ఇంటర్నెట్ యూజర్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. బైక్‌ల తర్వాత, కదులుతున్న కారులో బహిరంగ ప్రేమ అని పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు.

Read Also: Back Pain Exercises: నడుం నొప్పి వేధిస్తోందా? తగ్గించే వ్యాయామాలు ఇవే!

వీడియోలో.. హ్యుందాయ్ వెర్నా సెడాన్‌లో ఒక జంట వాహనం నడుస్తున్నప్పుడు సన్‌రూఫ్ నుంచి బయటకు వచ్చి ఒకరినొకరు కౌగిలించుకోవడాన్ని చూడవచ్చు. ఈ దృశ్యాలను వెనక వాహనంలో వస్తున్న వ్యక్తి రికార్డ్ చేశాడు. దీనిని గమనించిన కారు డ్రైవర్.. వీడియో తీసిన వ్యక్తిని బెదిరించి, ఆ వీడియోను డిలీట్ చేయించడం గమనార్హం. రోడ్డు భద్రతా ప్రోటోకాల్‌లను ఉల్లంఘించినందుకు, తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించినందుకు పోలీసులు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. క్లిప్ ఇంటర్నెట్‌లో షేర్ అయిన తక్కువ సమయంలో లక్షల వ్యూస్ పొందింది. ఈ వీడియో చూసిన తర్వాత నెటిజన్లు కామెంట్ల రూపంలో దుమ్మెత్తి పోస్తున్నారు. పిల్లలు ఇలాంటి పనులు చేయడం సరికాదని, వీడియోకు ఉత్తర ప్రదేశ్ పోలీసుల ట్విట్టర్ హ్యాండిల్‌ను ట్యాగ్ చేసి, చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కాగా వీరంతా ఇలా ప్రవర్తించేది పబ్లిసిటీ కోసమా, లేక సోషల్ మీడియా వ్యూస్ కోసమా అన్నది గమనించాల్సిన విషయం. టెక్నాలజీ పుష్కలంగా పెరగడంతో మనం ఇలాంటి పనులు చేసేముందు ఎప్పుడూ మనచుట్టూ కెమెరాలు ఉంటాయన్న విషయం గుర్తుపెట్టుకోవాలి.

Read Also:Earthquake: ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో భూకంపం.. ఈ నెలలోనే మూడో సారి

Show comments