Site icon NTV Telugu

Shocking: పిల్లలను కని అమ్మడమే వారి పని.. ఇప్పటికి ఎంతమందో తెలుసా..

Child Death

Child Death

Shocking: మహారాష్ట్రలోని నాగపూర్‎లో దారుణం వెలుగులోకి వచ్చింది. 51నెలల్లో ఐదుగురికి జన్మనిచ్చిన దంపతులు.. కన్న శిశువులనే అమ్మారు. ఎనిమిది నెలల చిన్నారి అపహరణ కేసులో పోలీసులు దంపతులను అరెస్ట్ చేసి విచారిస్తుండగా నమ్మలేని నిజం బయటకు పొక్కింది. పోలీసుల కథనం ప్రకారం.. రాజస్థాన్ కు చెందిన యోగేంద్ర ప్రజాపతి, రీటా అనే మహిళను 2017లో పెళ్లి చేసుకున్నాడు. 2018లో వారికి తొలుత పాప పుట్టగా 25వేల రూపాయలకు చిన్నారిని అమ్మేశారు. అంతే కాకుండా వారు జన్మనిచ్చిన మరో ఇద్దరు పిల్లలను కూడా ఇలాగే కనడం ఆ తర్వాత అమ్మడం ప్రారంభించారు. ఇదేదో బిజినెస్ బాగుందని భావించిన ఆ జంట ముక్కుపచ్చలారని పసికందులను తమ తల్లిదండ్రుల నుంచి అపహరించి… ఇష్టారాజ్యాంగా అమ్ముతూ భారీగా సొమ్ము చేసుకున్నారు.

Read Also: Allu Arjun: బాలీవుడ్ మూవీకి అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్.. పుష్క2 కంటే ముందే రిలీజ్

కానీ వారి దందాకు పోలీసులు గండి కొట్టారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా ఎన్నో నమ్మశక్యం కాని విషయాలు వెలుగులోకి వచ్చాయి. నవంబర్ 10న నాగ్ పూర్ లోని బాలాఘాట్లో ఎనిమిది నెలల పసికందును ఈ జంట కిడ్నాప్ చేసింది. తమ బిడ్డ కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆ తల్లిదండ్రులు. దీంతో ప్రజాపతి దంపతులను పోలీసులు ఐదుగంటల్లోనే పట్టుకున్నారు. పోలీసుల చెరనుంచి తప్పించుకుని తిరుగుతుండగా తాజాగా మరోసారి బాలాఘాట్లో పోలీసులకు పట్టుబడ్డారు. ఈ సారి తమదైన శైలిలో విచారణ జరుపగా 51నెలల్లో 5గురు పిల్లలకు జన్మనివ్వగా.. వారిలో ముగ్గురిని మధ్యప్రదేశ్ రాష్ట్రానికి అమ్మినట్లు తెలిపారు. అలా సుమారు ఐదేళ్లలో ఇతరుల 9మంది చిన్నారులను పలు రాష్ట్రాల్లో విక్రయించినట్లు పోలీసులు తెలిపారు. పిల్లలను కొనుగోలు చేసిన వారికోసం పోలీసులు వెతుకుతున్నారు.

Exit mobile version