NTV Telugu Site icon

Maharashtra: సోదరిని ముక్కలు ముక్కలుగా నరికి నదిలో పడేసిన తమ్ముడు..

Crime

Crime

పూణెలోని ఓ మురికివాడలో గది విషయంలో తలెత్తిన వివాదంతో తమ్ముడు, అతని భార్య తన సోదరిని హత్య చేశారు. ఇద్దరూ కలిసి మహిళ తల నరికి మృతదేహాన్ని నదిలో పడేశారు. ఈ క్రమంలో.. పోలీసులు దంపతులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు అష్ఫాక్ ఖాన్, అతని భార్య హమిదాగా గుర్తించారు. కాగా.. ఆగస్టు 26న ఖరాడి ప్రాంతంలోని ముఠా నది ఒడ్డున ఓ మహిళ మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. మృతదేహానికి చేతులు, కాళ్లు లేవు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు.. ఆ మహిళను సకీనా ఖాన్ (48)గా గుర్తించారు.

Read Also: Mobile phone explode: ఛార్జింగ్ సమయంలో చేతిలో పేలిన మొబైల్ ఫోన్.. బాలుడికి తీవ్రగాయాలు..

ఈ ఘటనపై జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ రంజన్‌కుమార్ శర్మ మాట్లాడుతూ.. “పుణె సిటీ పోలీసులు ముఠా నది ఒడ్డు నుండి ఒక మహిళ మొండెం స్వాధీనం చేసుకున్నారు. శరీరంపై బట్టలు లేవు. నిందితులు మృతదేహాన్ని నదిలో పడేసే ముందు సాక్ష్యాలు లభించకుండా శరీరాన్ని ముక్కలు చేశారు.” అని తెలిపారు. శివాజీ నగర్‌ ప్రాంతంలోని మురికివాడలోని ఓ గది యాజమాన్యం విషయంలో సకీనాకు ఆమె సోదరుడు అష్ఫాక్‌, కోడలు హమీదాతో గొడవలు జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది.

Read Also: Air force: ఎయిర్ ఫోర్స్ డిప్యూటీ చీఫ్గా తేజిందర్ సింగ్ బాధ్యతలు స్వీకరణ..

ఈ క్రమంలో.. నిందితుడు సోదరుడు అష్ఫాక్, కోడలు హమీదాను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వీరిద్దరూ బాధితురాలిని గొంతు నులిమి హత్య చేసినట్లు తేలింది. ఆ తర్వాత సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు మృతదేహాన్ని ముక్కలుగా నరికివేశారని జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ పేర్కొన్నారు. ఈ క్రమంలో.. ఇండియన్ జస్టిస్ కోడ్ (BNS) సెక్షన్ 103 (హత్య), 238 (సాక్ష్యాలను నాశనం చేయడం) కింద పోలీసులు దంపతులను అరెస్టు చేశారు.

Show comments