NTV Telugu Site icon

Couple Arrested: వృద్ధ అమ్మమ్మపై దాడి చేసిన దంపతులను కటకటపాలు చేసిన పోలీసులు..!

2

2

మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్‌లో తన 75 ఏళ్ల అమ్మమ్మపై దాడి చేసినందుకు ఒక వ్యక్తి. అతని భార్యను అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి మార్చి 28న తెలిపారు. వృద్ధురాలిని చిత్రహింసలకు గురిచేస్తున్న వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను దీపక్ సేన్, అతని భార్య పూజా సేన్ నగరంలోని జహంగీరాబాద్, బర్ఖేడి నివాసితులుగా గుర్తించారు. భోపాల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (DCP, జోన్ 1) ప్రియాంక శుక్లా మాట్లాడుతూ.., “రెండు రోజుల క్రితం దంపతులిద్దరూ ఒక మహిళ వృద్ధురాలిపై దాడి చేస్తున్న వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ ఫామ్‌ లలో వైరల్ కాగా.. పోలీసులు ఈ విషయంపై దృష్టి సారించినప్పుడు, నిందితులును దీపక్ సేన్‌గా గుర్తించారు. వీరు జహంగీరాబాద్‌లో నివసిస్తున్నారు. వీరు తమ అమ్మమ్మపై దాడి చేసి అసభ్యంగా ప్రవర్తించారు.

Also read: Memantha Siddham Bus Yatra: ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. నేడు సాగనుంది ఇలా..

వీడియో ఆధారంగా జహంగీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి నిందితులిద్దరినీ బుధవారం సాయంత్రం అరెస్టు చేశారు. వారిని గురువారం జైలుకు పంపినట్లు అధికారి తెలిపారు. “వృద్ధ మహిళ వాస్తవానికి ఝాన్సీకి చెందినది. కాకపోతే ఇక్కడ అతని మనవడి వద్ద నివసిస్తున్నారు. ఈ సంఘటన మార్చి 21 – 22 తేదీలలో జరిగి ఉండొచ్చు అని, కాకపోతే మార్చి 26 తర్వాత ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సంఘటన తర్వాత, వృద్ధురాలిని ఝాన్సీకి తిరిగి పంపించారు. ఇక పూర్తి వివరాలకోసం ఆమెను కోసం తిరిగి ఇక్కడకు పిలిచారు. ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించగా.. తీవ్ర గాయాలైనట్లు తేలింది. ఆమె చెప్పిన దాని ఆధారంగా,.. ఈ విషయంలో మరిన్ని సెక్షన్లు పెరిగాయి. దాడికి గల కారణాలపై డీసీపీ శుక్లాను ప్రశ్నించగా.. ప్రాథమిక విచారణలో ఇంటి వివాదాలు, ఆస్తి సమస్యలు ఉన్నట్లు తేలిందని చెప్పారు.

Also read: CM Revanth Reddy: నేడు పీఈసీ సమావేశం.. లోక్‌ సభ ఎన్నిక వ్యూహంపై చర్చ

ఐపీసీ సెక్షన్లు 294, 323, 325, 506, 342, 34 కింద కేసు నమోదు చేశామని, దీనిపై తదుపరి విచారణ జరుపుతున్నామని అధికారి తెలిపారు. ఇదిలా ఉండగా., తన మనవడు దీపక్, అతని భార్య తనను నిర్దాక్షిణ్యంగా కొట్టారని, గత రెండు మూడు నెలలుగా ఇలాగే చేస్తున్నారని బాధితురాలు బతి సేన్ (75) తెలిపారు.