Medaram Jatara: నేటి నుండి మేడారం సమ్మక్క- సారలమ్మ మహా జాతర హుండీల లెక్కింపు..

  • నేటి నుండి మేడారం సమ్మక్క- సారలమ్మ మహా జాతర హుండీల లెక్కింపు
  • హనుమకొండలోని తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపంలో ఏర్పాట్లు
  • 827 హుండీలను తరలించారు
Medaram

Medaram

మేడారం మహాజాతర ఈ ఏడాది అంగరంగ వైభవంగా జరిగింది. లక్షలాదిమంది భక్తులు వనదేవతలైన సమ్మక్క సారలమ్మలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులతో కిటకిటలాడుతూ మేడారం జనసంద్రమైంది. ఈ జాతరలో కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారమైన సమ్మక్క సారలమ్మ తల్లులకు భక్తులు కానుకలు సమర్పించుకున్నారు. ఈ నేపథ్యంలో నేటి నుండి మేడారం సమ్మక్క- సారలమ్మ మహా జాతర హుండీల లెక్కింపు చేపట్టనున్నారు అధికారులు. హనుమకొండలోని తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపంలో ఏర్పాట్లు పూర్తి చేశారు.

Also Read:Lenin : పెద్ది రాకతో అయ్యగారి ‘లెనిన్’ సినిమా పోస్ట్ పోన్

ఆర్టీసీ కార్గో ద్వారా మేడారం నుండి హనుమకొండకు 827 హుండీలను తరలించారు. హుండీ లెక్కింపుకు 15 రోజుల పైనే పట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. గత మహా జాతరలో రూ.15 లక్షల పైగానే హుండీ ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ జాతరలో మరింత ఆదాయం పెరుగుతుందని అధికార యంత్రాంగం అంచనా వేస్తోంది. హుండీల లెక్కింపులో 100 మంది సిబ్బంది పాల్గొనున్నట్లు అధికారులు తెలిపారు.