Corruption Case: భారీగా అక్రమాస్తులు, నగదు, బంగారంతో పాటు లంచాలు డిమాండ్ చేసిన కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) ఓ భారీ లంచకోండి అధికారిని అరెస్ట్ చేసింది. పంజాబ్ లోని రూప్‌నగర్ రేంజ్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ (DIG)గా పనిచేస్తున్న సీనియర్ ఐపీఎస్ అధికారి హర్చరణ్ సింగ్ భుల్లర్ (2009 బ్యాచ్)ను అవినీతి కేసులో సీబీఐ అరెస్టు చేసింది. మొదట రూ.8 లక్షల లంచం డిమాండ్‌తో మొదలైన ఈ కేసు దర్యాప్తులో ఏకంగా రూ.5 కోట్ల నగదు, లగ్జరీ వాహనాలు, బంగారం, హై ఎండ్ వాచ్‌లు వంటి భారీ అక్రమాస్తులను సీజ్ చేసారు అధికారులు.
Modi-Trump: రష్యా చమురుపై మోడీ-ట్రంప్ మధ్య అలాంటి సంభాషణే జరగలేదు.. ఖండించిన భారత్
డిఐజి భుల్లర్‌తో పాటు.. ఆయనకు మధ్యవర్తిగా పనిచేసిన కృష్ణ అనే ప్రైవేట్ వ్యక్తిని కూడా సీబీఐ అరెస్ట్ చేసింది. స్థానిక వ్యాపారవేత్తపై నమోదైన క్రిమినల్ కేసును ‘సెటిల్’ చేయడానికి, ప్రతి నెలా డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేయడానికి ఈ అధికారి తన మధ్యవర్తి ద్వారా లంచాలు తీసుకుంటున్నట్లు సీబీఐ తెలిపింది. పంజాబ్ లోని ఫతేగఢ్ సాహిబ్‌కు చెందిన ఆకాశ్ బట్టా అనే స్క్రాప్ డీలర్ ఐదు రోజుల క్రితం సీబీఐకి లిఖితపూర్వక ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదైంది. తన వ్యాపార కార్యకలాపాలకు సంబంధించిన తప్పుడు కేసులో ఇరికిస్తానని భుల్లర్ బెదిరిస్తున్నారని, దీనికి అదనంగా ప్రతి నెలా ‘సెటిల్‌మెంట్’ చెల్లింపులతో పాటు తొలి విడతగా రూ.8 లక్షలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారని ఫిర్యాదుదారు ఆరోపించారు.
సీబీఐ ఎఫ్ఐఆర్ ప్రకారం.. భుల్లర్ ఈ చెల్లింపులను తన అనుచరుడైన కృష్ణ ద్వారా పంపాలని డిమాండ్ చేశారు. కృష్ణ తరచుగా ఫిర్యాదుదారుడిపై ఒత్తిడి తెచ్చేవారని ఒక ఫోన్ సంభాషణలో “ఆగస్టు పేమెంట్ చెల్లించలేదు, సెప్టెంబర్ పేమెంట్ చెల్లించలేదు” అని చెప్పినట్లు సమాచారం. ప్రాథమిక విచారణ అనంతరం సీబీఐ చండీగఢ్‌లోని సెక్టార్ 21లో ప్లాన్ చేసింది. ఈ ఆపరేషన్‌లో డిఐజి తరపున ఫిర్యాదుదారుడి నుండి రూ.8 లక్షలు తీసుకుంటుండగా కృష్ణ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. డబ్బు అందజేసిన వెంటనే ఫిర్యాదుదారుడు, డిఐజి మధ్య కాల్ ఏర్పాటు చేయగా.. అందులో అధికారి డబ్బు అందినట్లు అంగీకరించి, తన ఆఫీసుకు రావాలని ఆదేశించారు. ఈ ఆధారాల ఆధారంగా సీబీఐ బృందం డిఐజి భుల్లర్‌ను మొహాలీలోని ఆయన కార్యాలయంలో గుర్తించి ఇద్దరు నిందితులను లాంఛనంగా అరెస్టు చేసింది.
Shocking Incident: టికెట్ తీసుకోకపోవడమే తప్పు.. ఆపై టీటీఈపై దాడి చేసిన మహిళలు..!
అరెస్టు తరువాత భుల్లర్‌కు సంబంధించిన రూప్‌నగర్, మొహాలీ, చండీగఢ్ లోని అనేక ప్రాంతాలలో సీబీఐ విస్తృత సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో సుమారు 5 కోట్ల నగదు (లెక్కించే ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది), 1.5 కిలోల బంగారం, ఆభరణాలు, పంజాబ్‌లో ఉన్న స్థిరాస్తులకు సంబంధించిన పత్రాలు, రెండు లగ్జరీ వాహనాలు (మెర్సిడెస్, ఆడి), 22 హై-ఎండ్ చేతి గడియారాలు, లాకర్ కీలు, 40 లీటర్ల దిగుమతి చేసుకున్న మద్యం, డబుల్ బారెల్ షాట్‌గన్, పిస్టల్, రివాల్వర్ మరియు ఎయిర్‌గన్‌తో సహా ఆయుధాలు ఇంకా మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకొన్నారు.
అలాగే మధ్యవర్తి కృష్ణ నివాసం నుండి సీబీఐ మరో రూ.21 లక్షల నగదును స్వాధీనం చేసుకుంది. భుల్లర్, కృష్ణ ఇద్దరిని శుక్రవారం కోర్టులో హాజరుపరుస్తారని అధికారులు తెలిపారు. అక్రమాస్తుల పూర్తి స్థాయి, మనీ లాండరింగ్ లింకులను తెలుసుకోవడానికి తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది. 2009 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన భుల్లర్ పాటియాలా రేంజ్ డిఐజి, విజిలెన్స్ బ్యూరో జాయింట్ డైరెక్టర్, మొహాలీ, సంగ్రూర్, ఖన్నా వంటి ప్రాంతాలలో సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌తో సహా అనేక కీలక పదవులలో పనిచేశారు. 2021లో శిరోమణి అకాలీదళ్ (SAD) నాయకుడు బిక్రమ్ సింగ్ మజితియాపై హైప్రొఫైల్ డ్రగ్ ట్రాఫికింగ్ కేసును దర్యాప్తు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT)కు ఆయన నాయకత్వం వహించారు.
