NTV Telugu Site icon

Cop Kills Family: సర్వీస్‌ రివాల్వర్‌తో భార్య, కొడుకు, పెంపుడు కుక్కను చంపి.. తర్వాత..

Punjab Cop

Punjab Cop

Cop Kills Family: పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాలో ఓ పోలీసు అధికారి ఊహించని దారుణానికి తెగబడ్డాడు. ఏఎస్సై హోదాలోని అధికారి తన సర్వీస్ రివాల్వర్‌తో భార్య, కొడుకు, పెంపుడు కుక్కను కాల్చి చంపాడు. అమృత్‌సర్‌లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ భూపీందర్ సింగ్ తన సర్వీస్ రివాల్వర్‌తో అతని భార్య బల్జీత్ కౌర్ (40), కుమారుడు లవ్‌ప్రీత్ సింగ్ (19)లను హత్య చేశాడు. తన పెంపుడు కుక్కను కూడా కాల్చి చంపి పారిపోయాడు. కొన్ని గంటల తర్వాత భూపీందర్ సింగ్ తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. సింగ్ ఈ దారుణానికి ఒడిగట్టడానికి కారణం ఏమిటనేది ఇంకా నిర్ధారణ కాలేదని, ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. గురుదాస్‌పూర్ పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

Read Also: Shahjahanpur: వేధింపుల కేసుతో ప్రతీకారం.. మహిళ ముక్కును కోసిన వ్యక్తి

గురుదాస్‌పూర్ పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుడు బుబ్లి గ్రామానికి చెందిన యువతిని కిడ్నాప్ చేశాడని, ఆమె నేరం చేయడాన్ని చూసినట్లు తెలిసింది.పోలీసులు బాలికను సురక్షితంగా రక్షించారు. వైద్య పరీక్షల కోసం ఆమెను సివిల్ ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించి ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలను సేకరిస్తున్నారు.

Show comments