డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా ఇటీవల రోడ్డు ప్రమాదాలు పెరిగిపోయాయి. అమాయకులు ఈ ప్రమాదాల్లో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో వాహనంతో ఢీకొట్టి ఈడ్చుకుపోతున్నారు. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ కంటైనర్ డ్రైవర్ బైకును ఢీకొట్టి 3 కి.మీలు లాక్కెళ్లాడు. మానవత్సం మరిచి వాహనాన్ని ఆపకుండా 3 కి.మీ. ద్విచక్ర వాహనాన్ని ఈడ్చుకెళ్లింది కంటెయినర్. కంటైనర్ ముందు భాగంలో బైక్ ఇరుక్కుపోయింది. మావల బైపాస్ జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. తలమడుగు మండలం దహేగాం కు చెందిన టూ వీలర్ డ్రైవర్ ఆత్రం రాంజీకి పెను ప్రమాదం తప్పింది.
Also Read:AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ స్కాం కేసులో అనిల్ చోక్రా రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు..
ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు కంటైనర్ ను వెంబడించి మావల పోలీసులు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన కంటైనర్ డ్రైవర్ పై వీడు అసలు మనిషేనా అంటూ పలువురు మండి పడుతున్నారు. అతి వేగం, అజాగ్రత్తగా వాహనాలను నడుపుతూ రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న అలాంటి డ్రైవర్ల పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
