AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో A-49 ఆర్థిక నేరస్తుడు అనిల్ చోక్రా రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. అనిల్ చోఖరా షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి మద్యం ముడుపుల డబ్బును బదిలీ చేశారు. తర్వాత సిండికేట్ సభ్యులకు చేరవేశాడు.. రాజ్ కేసిరెడ్డి, ముప్పిడి అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో వసూలు చేసిన 77.55 కోట్ల రూపాయలను ముంబైలో నాలుగు షెల్ కంపెనీలకు బదిలీ చేశాడు.. అదానీ డిస్టలరీస్ నుంచి రూ. 18 కోట్లు, లీలా డిస్ట్రలరీస్ నుంచి రూ. 20, స్పై ఆగ్రో రూ. 39 మొత్తం 77 కోట్ల రూపాయలను నాలుగు షెల్ కంపెనీలకు బదిలీ అయ్యాయి. అక్కడ నుంచి మరో 32 షెల్ కంపెనీలకు డబ్బును మళ్లించారు.. షెల్ కంపెనీల్లో అక్రమ లావాదేవీలు గుర్తించడానికి ముంబైలో పలుమార్లు దర్యాప్తు చేపట్టారు.. 10-03-2025 నుంచి 10-11-2025 వరకు జరిపిన విచారణలో 25 షెల్ కంపెనీలు అడ్రస్సులతో సహా గుర్తించారు.
Read Also: NMK : నందమూరి మోక్షజ్ఞ.. టాలీవుడ్ ఎంట్రీ ఈ ఏడాది కూడా లేనట్టే?
అయితే, ఈ షెల్ కంపెనీలు భౌతికంగా లేకుండా కేవలం అక్రమ లావాదేవీల కోసం పేపర్లపై మాత్రమే ఏర్పాటు చేశారు. షెల్ కంపెనీల అడ్రస్ ఉన్న యజమానులతో మాట్లాడగా ఈ సంస్థలకు ఎపుడు లీజుకు ఇవ్వలేదని చెప్పినట్లు సెట్ అధికారులు గుర్తించారు. వైట్ మనీని బ్లాక్ మనీగా మార్చి షెల్ కంపెనీ ద్వారా ఆ డబ్బును ఉపయోగించడంలో కట్టుదిట్టంగా షెల్ కంపెనీలు ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. అనిల్ చోక్రా బినామీ డైరెక్టర్లు, ప్రొఫెషనల్ ఫెసిలిటేటర్ల ద్వారా షెల్ కంపెనీలు నిర్వహించాడు.
ఇక, కంపెనీలు డైరెక్టర్లు, కార్యదర్శులు జాబితా గుర్తించడానికి ఇంకా దర్యాప్తు చేపట్టాల్సి ఉంది. షెల్ కంపెనీలు, లీలా డిస్ట్రలరీస్ కు జారీ చేసిన 114 ఇన్వాయిస్, ఈవే బిల్లులు సీజ్ చేశామని సిట్ అధికారులు తెలిపారు. రూ. 221 కోట్ల నకిలీ ఇన్వాయిస్ జారీ చేసినట్లు గుర్తించాం.. కృపతి మల్టీ వెంచర్స్, ఓల్విక్ మల్టీ వెంచర్స్ జారీ చేసిన ఎన్వాయిసులు 200 కోట్లకు పైగా నకిలీవని గుర్తించాము.. 2021-2023 వరకు షెల్ కంపెనీలు దాఖలు చేసిన ఇన్వాయిస్, ఈ వే బిల్లులు పరిశీలిస్తే తీవ్ర వ్యత్యాసం ఉన్నట్లు తేలింది. 36 షెల్ కంపెనీల్లో 20 ఇన్ యాక్టివ్ గా ఉండడంతో సుమోటుగా జీఎస్టీ అధికారులు రద్దు చేశారు.. ఆ సమయంలో జీఎస్టీ రేటన్లు వెల్లడించకుండా, లెక్కించకుండా ఉండటాన్ని భట్టి అవి షెల్ కంపెనీలని స్పష్టం అయ్యింది. అనిల్ చోక్రా ఆర్థిక అవసరాలు ఉన్న వారిని గుర్తించి వారి పేర్ల మీద షెల్ కంపెనీలు తెరిచి కార్యకలాపాలు నిర్వహించాడని పేర్కొన్నారు.
Read Also: Kaantha: మొదటి రోజు కలెక్షన్స్..బానే రాబట్టిందే!
అలాగే, పదుల సంఖ్యలో సిమ్ కార్డులు, బ్యాంక్ ఖాతాలు తెరిచి ఆర్థిక నేరాలకు అనిల్ చోక్రా పాల్పడ్డాడు అని సిట్ తెలిపింది. బ్యాంకు ఖాతాల లావాదేవీలు, కాల్ డేటా రికార్డ్స్, టెక్నికల్ డేటా పరిశీలించి అనిల్ చోక్రాను నిందితుడిగా గుర్తించాం.. అనిల్ చోక్రా షెల్ కంపెనీలు ఉపయోగించి మద్యం సరఫరా దారుల దగ్గర నుంచి వసూలు చేసిన డబ్బును బ్లాక్ మనీగా మార్చాడు.. ఈ డబ్బులు ఎలా ఇతరులకు మళ్ళించాడు అనే దానిపై విచారణ చేయాల్సి ఉందన్నారు.