Site icon NTV Telugu

South Central Railway: తిరుమల ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించిన ప్యాసింజర్‌కి రూ.25 వేల పరిహారం.. కారణం?

News Ap

News Ap

తిరుమల ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించిన ప్యాసింజర్‌కి రూ.25,000 పరిహారం చెల్లించాలని ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలోని జిల్లా వినియోగదారుల కమిషన్ దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సిఆర్)ని ఆదేశించింది. ఈ ప్రయాణికుడు, అతని కుటుంబం తిరుమల ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్నప్పుడు సమస్యలను ఎదుర్కొన్నారు. రైలులోని టాయిలెట్లలో నీటి కొరత, ఎయిర్ కండిషనింగ్ సరిగా లేకపోవడంతో ప్రయాణీకుడు, ఆయన కుటుంబం అనుభవించిన శారీరక, మానసిక క్షోభకు ప్రతిస్పందనగా ఈ పరిహారం ఇవ్వాలని బుధవారం నివేదించింది. రైల్వేలు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణానికి నిబద్ధతతో ఛార్జీలు వసూలు చేస్తున్నందున, మరుగుదొడ్లలో నీరు, ఎయిర్ కండిషన్, సరైన పర్యావరణం వంటి ప్రాథమిక సౌకర్యాలను కల్పించాల్సిన బాధ్యత ఉందని జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్-I (విశాఖపట్నం) తీర్పు చెప్పింది.

READ MORE: UP Crime: మత్తు ఇంజెక్షన్ ఇచ్చి మైనర్ బాలికపై జిమ్ ట్రైన్ అత్యాచారం..

ఫిర్యాదు ఏమిటి?
జూన్ 5, 2023న, 55 ఏళ్ల వీ. మూర్తి, ఆయన కుటుంబం తిరుపతిలో రైలు ఎక్కారు. సౌకర్యవంతమైన ప్రయాణం కోసం తిరుపతి నుంచి విశాఖపట్నం వరకు తిరుమల ఎక్స్‌ప్రెస్‌లో నాలుగు 3ఎసి టిక్కెట్లను బుక్ చేసుకున్నారు.
ఈ కోచ్‌లో సరైన నీటి సదుపాయం, ఎయిర్ కండిషనింగ్ లేకపోవడం, అపరిశుభ్రత వాతావరణం వల్ల ఆయనతో పాటు కుటుంబీకులు కూడా ఇబ్బందికి గురయ్యారు. టాయిలెట్లు కూడా సరిగ్గా లేవు. కుటుంబానికి మొదట B-7 కోచ్‌లో బెర్త్ కేటాయించారు. తర్వాత వారిని 3ఏ బదులుగా 3ఈ కోచ్‌కు బదిలీ చేసినట్లు ఆయనకు రైల్వే అధికారుల నుంచి సందేశం వచ్చింది. దీంతో తీవ్ర అసౌకర్యానికి గురైన ఆయన సంబంధిత రైల్వే కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అయినా చర్యలు తీసుకోకపోవడంతో జిల్లా వినియోగదారుల కమిషన్‌ని సంప్రదించారు. అయితే.. రైల్వే శాఖ ఈ వాదనలను తోసిపుచ్చింది. మూర్తి ప్రభుత్వం నుంచి డబ్బులు దండుకోవడానికి తప్పుడు ఆరోపణలు చేశారని వాదించింది. ఆయన కుటుంబం రైల్వే సేవలను ఉపయోగించి సురక్షితంగా చేరుకున్నారని తెలిపింది.

READ MORE:King Charles: బెంగళూరులో బ్రిటన్ రాజు చార్లెస్ రహస్య పర్యటన.. దేనికోసమంటే..!?

Exit mobile version