Site icon NTV Telugu

Constipation Remedies: మలబద్ధకం సమస్యతో పడుతున్నారా?.. ఉదయాన్నే ఈ పనులు చేయండి!

Constipation Home Remedies

Constipation Home Remedies

Constipation Symptoms and Causes: ప్రస్తుత రోజుల్లో ఎక్కువ మందిని వేధిస్తోన్న సమస్య ‘మలబద్ధకం’. మారుతోన్న జీవనశైలి, సరైన ఆహారం తీసుకోకపోవడం, శరీరానికి కావాల్సిన నీటిని తీసుకోకపోవడం వంటి పలు కారణాల మలబద్ధకం సమస్య వస్తుంది. సిగ్గు కారణంగా చాలా మంది మలబద్ధకం సమస్యను బయటికి చెప్పుకోలేకపోతున్నారు. అయితే ఈ సమస్య నుంచి చాలా సులువుగా బయటపడొచ్చు. కొన్ని అలవాట్లను మీ ఉదయపు దినచర్యలో భాగంగా చేసుకుంటే.. మీ జీవక్రియ వేగవంతం అవడమే కాకుండా మానసిక స్థితి కూడా మెరుగుపడుతుంది. ఉదయం పూట ఏ అలవాట్లు పాటించాలో (Constipation Relief) ఇక్కడ చూద్దాం.

నాలుకను శుభ్రం చేసుకోవడం:
పళ్లు తోముకున్న తర్వాత నాలుకను శుభ్రం చేసుకోవడం వల్ల మలబద్ధకం రాదు. ఇది కావిటీస్ తొలగించడానికి సహాయపడుతుంది. అదే సమయంలో నోటిలో లాలాజలం ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది.

ఖాళీ కడుపుతో వ్యాయామం:
జీవక్రియను పెంచడానికి సులభమైన మార్గం ఉదయం ఖాళీ కడుపుతో వ్యాయామం చేయడం. ఇలా చేయడం వల్ల మలబద్ధకం సమస్య ఉండదు. మీ బరువు కూడా తగ్గుతుంది. అందుకే ఉదయం ఖాళీ కడుపుతో వ్యాయామం చేయడం ఉత్తమం.

నీరు:
ఆరోగ్యకర జీవనం కోసం మనిషి రోజుకు 3 నుంచి 5 లీటర్ల మంచి నీటిని తాగాలి. తక్కువ స్థాయిలో నీటిని తీసుకోవడం వల్ల శరీరంలో నీటి శాతం తక్కువ అయి డీహైడ్రేషన్‌కు గురవుతుంది. అప్పుడు శరీరం కావాల్సిన నీటిని మూత్రం, మలం నుంచి తీసుకుంటుంది. ఫలితంగా మూత్ర సంబంధిత సమస్యలు, మలబద్ధకం వస్తుంటాయి.

Also Read: Food To Avoid With Tea: టీతో పొరపాటున కూడా ఈ పదార్థాలు తినకండి.. లేదంటే భారీ మూల్యం తప్పదు!

గోరువెచ్చని నీరు త్రాగాలి:
ఉదయాన్నే గోరువెచ్చని నీటిని ఖాళీ కడుపుతో తాగడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. ఇది శరీరంలో ఉండే టాక్సిన్స్‌ని తొలగిస్తుంది. మలబద్ధకం సమస్య, బరువును తగ్గించుకోవాలనుకుంటే.. మీరు ఉదయం నిద్రలేచిన తర్వాత రోజు గోరువెచ్చని నీటిని తాగడం ప్రారంభించాలి. ఇలా చేయడం ద్వారా కడుపుకు సంబంధించిన అన్ని సమస్యల నుండి బయటపడతారు.

అల్పాహారం:
మలబద్ధకం సమస్య నుంచి బయటపడాలంటే మంచి అల్పాహారం తీసుకోవాలి. పప్పులు, మూంగ్ దాల్, చినా వంటి సులభంగా జీర్ణమయ్యే ఆహారాలను అల్పాహారంలో చేర్చండి. జంక్ ఫుడ్ తీసుకోవడం మానేసియాలి.

Also Read: Rohit-Ishan Kishan: ఇషాన్‌ కిషన్‌ కోసమే ఇన్నింగ్స్‌ను ఆలస్యంగా డిక్లేర్డ్‌ చేశా: రోహిత్ శర్మ

Exit mobile version