Constable: మద్యం మత్తులో కానిస్టేబుల్ రచ్చ.. మహిళను ఢీకొట్టి దురుసు ప్రవర్తన..
- జగిత్యాలలో మద్యం మత్తులో కానిస్టేబుల్ రచ్చ
- మహిళను ఢీకొట్టి దురుసు ప్రవర్తన
- స్కూటీపై వెళ్తున్న ఓ మహిళను, మద్యం మత్తులో అతివేగంగా వస్తూ తన ద్విచక్ర వాహనంతో ఢీకొట్టాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జగిత్యాలలో మద్యం మత్తులో కానిస్టేబుల్ రచ్చ రచ్చ చేశారు. మహిళను ఢీకొట్టి దురుసుగా ప్రవర్తించాడు. జగిత్యాల జిల్లా కేంద్రంలో పోలీస్ అనే బాధ్యత మరిచిన ఓ కానిస్టేబుల్ హంగామా చేశాడు. మద్యం మత్తులో వాహనం నడిపి మహిళను ఢీకొట్టడమే కాకుండా, తాను కానిస్టేబుల్ అంటూ అహంకార ప్రవర్తన చూపించాడు. జిల్లా కేంద్రంలోని శ్రీరామ థియేటర్ చౌరస్తా వద్ద స్కూటీపై వెళ్తున్న ఓ మహిళను, మద్యం మత్తులో అతివేగంగా వస్తూ తన ద్విచక్ర వాహనంతో ఢీకొట్టాడు కానిస్టేబుల్ వెంకటేష్. ప్రమాదం జరిగిన వెంటనే బాధ్యతగా స్పందించాల్సింది పోయి, “నేను కానిస్టేబుల్.. ఏం చేసుకుంటావో చేసుకో” అంటూ దురుసుగా ప్రవర్తించాడు.
Also Read:Stock Market: ట్రంప్ బెదిరింపులు.. నష్టాల్లో కొనసాగుతోన్న సూచీలు
Also Read
ఈ ఘటనను చూసిన స్థానికులు తీవ్ర ఆగ్రహానికి గురై, కానిస్టేబుల్‌ను అక్కడికక్కడే నిలదీశారు. “పోలీసు అయితే నీకేమైనా ప్రత్యేక చట్టం ఉందా?”, “నీ బైక్ నెంబర్ ప్లేట్ ఎక్కడ?” అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో అక్కడ పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న పట్టణ పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని గాయపడిన మహిళను ఆసుపత్రికి తరలించారు. మద్యం సేవించి ఉన్న కానిస్టేబుల్ వెంకటేష్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఆయన హెడ్‌క్వార్టర్స్‌లో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
UPI Charges: అక్టోబర్ 2న ‘నో UPI డే’.. అసలు ఏం జరుగుతుంది?
-
Amaravati Construction: అమరావతి నిర్మాణంలో కీలక సమస్య..! కార్మికులపై అధికారుల దృష్టి
-
Jayant C Paranjee: ఆడదని ముందే తెలుసు.. పవన్ కళ్యాణ్ సినిమాపై డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు!
-
Gandhi Jayanti 2026: గాంధీ జయంతి.. రాజ్‌ఘాట్‌లో బాపూజీకి ప్రధాని మోడీ ఘన నివాళులు
-
Car or Bike Buying Tips: కారు, బైక్ కొంటున్నారా? ఈ పని తప్పక చేయండి.. లేదంటే ఇబ్బందులే!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?