Site icon NTV Telugu

Tollywood Actress : తెలుగులో వరుస హిట్స్.. హిందీలో వరుస ప్లాప్స్

Mrunal

Mrunal

సీతారామంతో తెలుగు వాళ్లకు సీతామహాలక్ష్మీగా చేరువైన మృణాల్ ఠాకూర్. నార్త్ లో హిట్ సౌండ్ విని ఆరేళ్లు కావొస్తుంది. 2019లో వచ్చిన బాట్లా హౌస్ తర్వాత బ్లాక్ బస్టర్ ఎలా ఉంటుందో టేస్ట్ చూడలేదు. ‘సీతారామం’ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ ‘హాయ్ నాన్న’తో మరో హిట్ తన ఖాతాలో వేసుకుని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది. కానీ ‘ఫ్యామిలీ స్టార్’ ఆమె హ్యాట్రిక్ హిట్ కు బ్రేకులేయడంతో గోల్డెన్ లెగ్ ట్యాగ్ మిస్ చేసుకుంది.

బీటౌన్ లో’ జెర్సీ’ నుండి మొదలైన ప్లాప్ పరంపర ఇప్పటికీ కంటిన్యూ చేస్తోంది మృణాల్. ఆ మధ్యలో ఓటీటీలకే పరిమితమైంది బ్యూటీ. కొన్ని బోల్డ్ కంటెంట్ సినిమాలు చేసి టాక్ ఆప్ ది ఇండస్ట్రీగానూ మారింది కానీ హిట్ పడటం లేదు భామకు. ఇక హోప్స్ అన్నీ అజయ్ దేవగన్ ‘సన్నాఫ్ సర్దార్2’ పై పెట్టుకుంది. అప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ ఈ ఫిల్మ్ ‘సయ్యారా’, మహావతార నరసింహా చిత్రాల జోరుకు ఎదురెళ్లి నిండా మునిగింది. సినిమా చూసిన క్రిటిక్స్ పెదవి విరిచారు. దాంతో ఆ సినిమా మినిమం వసూళ్లు కూడా రాబట్టలేక ప్లాప్ గా నిలిచింది. ప్రెజెంట్ మృణాల్ త్రీ బాలీవుడ్ ఫిల్మ్స్ చేస్తోంది సీత. హై జవానీ తో ఇష్క్ హోనా హై, తుమ్ హో తో, పూజా మేరీ జాన్ కాకుండా తెలుగులో మరో టూ ప్రాజెక్ట్స్ కమిటయ్యింది. అడవిశేష్ డెకాయిట్ తో పాటు బన్నీ-అట్లీ ప్రాజెక్టుకు కమిటైందని టాక్. డెకాయిట్ ఈ ఏడాది క్రిస్మస్ కు రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు మేకర్స్. ఈ  సినిమా ఇటు తెలుగుతో పాటు హిందీలోనూ తెరకెక్కుతోంది. మరీ మేడమ్ ఈ  సినిమాతోనైనా ఇటు బీటౌన్, అటు టీటౌన్ లో ఒకేసారి హిట్ అందుకుంటుందా లేదో లెట్స్ సీ

Exit mobile version