Eye Flu Cases: కలకలం రేపుతోన్న కండ్ల కలక.. ఈ రాష్ట్రాల్లో మరీ దారుణం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Eye Flu Cases: దేశంలో కండ్ల కలక కలకలం సృష్టిస్తోంది. ముఖ్యంగా ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ తో పాటు పలు రాష్ట్రాల్లో భారీగా కేసులు నమాదవుతున్నాయి. మహారాష్ట్రలో జులైలో 87 వేల 761 కండ్లకలక కేసులు నమోదయ్యాయి. అడెనోవైరస్ కండ్లకలక ఈ సంవత్సరం అత్యంత ఎక్కువ కేసులను నమోదు చేస్తోంది. మహారాష్ట్ర బుల్దానాలో దాదాపు 13 వేల 550 కేసులు రికార్డయ్యాయి. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఇన్ఫెక్షన్ వేగంగా విస్తరిస్తోంది. మరోవైపు.. తెలుగు రాష్ట్రాల్లో కండ్ల కలక ఆందోళన కలిగిస్తోంది. విజయనగరం జిల్లాలోనూ ప్రతిరోజూ వందలాది కేసులు నమోదవుతున్నాయి.
Read Also: Chemical box blast: వరంగల్ లోని హంటర్ రోడ్డులో కెమికల్ బాక్స్ బ్లాస్ట్
Also Read
- Mobile Phone Blast: పిడుగుపాటుకు జేబులో పేలిన సెల్‌ఫోన్.. విద్యుత్ ఉద్యోగి మృతి
- How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
- Land Pass Books: 'భూదార్' పేరుతో పాస్ పుస్తకాలు.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు..
- Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
బీహార్‌లోని పాట్నాలో ఈ వారం 40 కేసులు నమోదయ్యాయి. హిమాచల్ ప్రదేశ్ నిట్ లో కండ్లకలక వ్యాప్తితో ఆఫ్‌లైన్ బోధనను నిలిపివేశారు. జూన్ నుంచి గుజరాత్లో 2 లక్షల 17 వేల కండ్లకలక కేసులు నమోదయ్యాయి. ఐ ఫ్లూ సోకిన పిల్లల్ని స్కూల్ కు పంపొద్దని చత్తీస్ గఢ్ ప్రభుత్వం విద్యాశాఖ అధికారుల్ని ఆదేశించింది. ఢిల్లీ, మహారాష్ట్ర, కర్నాటకలో దాదాపు 14వేల కంటే ఎక్కువ మంది స్పందనలను స్పీకరించిన లోకల్ సర్కిల్స్.. జాతీయ సర్వే నిర్వహించాయి. ఢిల్లీ నివాసితులలో 27 శాతం మంది వ్యాధి బారిన పడ్డారని తేలింది. ఇంట్లో ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది గత వారంలో కండ్లకలక బారిన పడ్డారని అధికారులు తెలిపారు. తీవ్ర ఆందోళన కలిగిస్తోన్న కండ్లకలక ఎరుపు, దురద, విపరీతమైన చిరాకు వంటి లక్షణాలతో కేసులు నమోదవుతున్నాయి. రద్దీగా ఉండే ప్రాంతాలలో సంచరించే వారికి, కార్యాలయాలకు వెళ్లేవారికి, పిల్లలకు పింక్ ఐ వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Tollywood : ఇండస్ట్రీ ఆశలన్నీ అక్టోబర్ తీరుస్తుందా?
-
Jailer 2 Telugu Trailer: ‘జైలర్ 2’ ట్రైలర్‌తో రజనీకాంత్ మాస్ తాండవం! అయినా కానీ..
-
Shiva: జపాన్‌లో నాగార్జున ‘శివ’ సునామీ.. జపాన్ ఫ్యాన్స్ ఇచ్చిన ఆ బిరుదు చూశారా?
-
Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
-
Mobile Phone Blast: పిడుగుపాటుకు జేబులో పేలిన సెల్‌ఫోన్.. విద్యుత్ ఉద్యోగి మృతి
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!