Site icon NTV Telugu

Eye Flu Cases: కలకలం రేపుతోన్న కండ్ల కలక.. ఈ రాష్ట్రాల్లో మరీ దారుణం..!

Eye Flu

Eye Flu

Eye Flu Cases: దేశంలో కండ్ల కలక కలకలం సృష్టిస్తోంది. ముఖ్యంగా ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ తో పాటు పలు రాష్ట్రాల్లో భారీగా కేసులు నమాదవుతున్నాయి. మహారాష్ట్రలో జులైలో 87 వేల 761 కండ్లకలక కేసులు నమోదయ్యాయి. అడెనోవైరస్ కండ్లకలక ఈ సంవత్సరం అత్యంత ఎక్కువ కేసులను నమోదు చేస్తోంది. మహారాష్ట్ర బుల్దానాలో దాదాపు 13 వేల 550 కేసులు రికార్డయ్యాయి. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఇన్ఫెక్షన్ వేగంగా విస్తరిస్తోంది. మరోవైపు.. తెలుగు రాష్ట్రాల్లో కండ్ల కలక ఆందోళన కలిగిస్తోంది. విజయనగరం జిల్లాలోనూ ప్రతిరోజూ వందలాది కేసులు నమోదవుతున్నాయి.

Read Also: Chemical box blast: వరంగల్ లోని హంటర్ రోడ్డులో కెమికల్ బాక్స్ బ్లాస్ట్

బీహార్‌లోని పాట్నాలో ఈ వారం 40 కేసులు నమోదయ్యాయి. హిమాచల్ ప్రదేశ్‌ నిట్ లో కండ్లకలక వ్యాప్తితో ఆఫ్‌లైన్ బోధనను నిలిపివేశారు. జూన్ నుంచి గుజరాత్‌లో 2 లక్షల 17 వేల కండ్లకలక కేసులు నమోదయ్యాయి. ఐ ఫ్లూ సోకిన పిల్లల్ని స్కూల్ కు పంపొద్దని చత్తీస్ గఢ్ ప్రభుత్వం విద్యాశాఖ అధికారుల్ని ఆదేశించింది. ఢిల్లీ, మహారాష్ట్ర, కర్నాటకలో దాదాపు 14వేల కంటే ఎక్కువ మంది స్పందనలను స్పీకరించిన లోకల్ సర్కిల్స్.. జాతీయ సర్వే నిర్వహించాయి. ఢిల్లీ నివాసితులలో 27 శాతం మంది వ్యాధి బారిన పడ్డారని తేలింది. ఇంట్లో ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది గత వారంలో కండ్లకలక బారిన పడ్డారని అధికారులు తెలిపారు. తీవ్ర ఆందోళన కలిగిస్తోన్న కండ్లకలక ఎరుపు, దురద, విపరీతమైన చిరాకు వంటి లక్షణాలతో కేసులు నమోదవుతున్నాయి. రద్దీగా ఉండే ప్రాంతాలలో సంచరించే వారికి, కార్యాలయాలకు వెళ్లేవారికి, పిల్లలకు పింక్ ఐ వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.

Exit mobile version