NTV Telugu Site icon

Shoba Rani : మహిళలను అడ్డుపెట్టుకుని గెలిచిన చరిత్ర పాడి కౌశిక్ రెడ్డిది

Shoba Rani

Shoba Rani

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపై చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్‌ మహిళా నేతలు కౌంటర్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా మహిళా కార్పొరేషన్ ఛైర్మన్ శోభా రాణి మాట్లాడుతూ.. పాడి కౌశిక్ రెడ్డి…చీరలు.. గాజులు వేసుకునే వాళ్ళు ఎవరూ చేతకాని వాళ్ళు కాదని విరుచుకుపడ్డారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు అని, గాజులు పెట్టుకునే వాళ్ళు చేతకాని వాళ్ళు అనుకుంటే నీ ఇంట్లో బిడ్డా.. భార్య ఉందని ఆమె అన్నారు. మహిళలను అడ్డుపెట్టుకుని గెలిచిన చరిత్ర పాడి కౌశిక్ రెడ్డి ది అని ఆమె మండిపడ్డారు. మహిళలను అవమానిస్తే.. చెప్పు దెబ్బలు తింటావని ఆమె ధ్వజమెత్తారు. చీర.. గాజులు ముందు కేసీఆర్..కేటీఆర్ కి పంపు అని, బీఆర్‌ఎస్‌ పుట్టుకనే.. ఇతర పార్టీల నుండి ఎంఎల్ఏ లను లాక్కుని పుట్టిందని ఆమె అన్నారు. కేసీఆర్ ఏ పార్టీలో పుట్టాడు.. నీ పక్కన కూర్చున్న ఎంఎల్ఏ లు ఏ పార్టీలో పుట్టాడో తెలుసుకో అని ఆమె వ్యాఖ్యానించారు. చరిత్ర తెలవకుండ మాట్లాడకు అని, అసభ్యంగా మాట్లాడిన కౌశిక్ మీద పోలీసు లు ఫిర్యాదు చేస్తామన్నారు. మహిళా కమిషన్ సుమోటో గా కేసు నమోదు చేయాలని, బరితెగించి రాజకీయాలు చేసే చరిత్ర కాంగ్రెస్ కి లేదు మీలాగా అని, 65 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే.. ప్రభుత్వం కూలిపోతుందని చెప్పిన మీకు సిగ్గు తెప్పించాలని ఎమ్మెల్యేలు బయటకు వచ్చారన్నారు.

Raj Tarun : అలాంటి సినిమాల కారణంగానే జనాల్లో నాకు చెడ్డ పేరు..

అనంతరం.. ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్పర్సన్ కాల్వ సుజాత మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌లో పుట్టిన ఎమ్మెల్యేలు ఎవరు మాట్లాడటం లేదని, పాడి కౌశిక్ రెడ్డికి పాడే ఎక్కే సమయం దగ్గర పడిందని, వినాశన కాలే విపరీత బుద్ధి అన్నట్టే ఉంది ఆయన వైఖరి అని ఆమె దుయ్యబట్టారు. తెలంగాణ ఉద్యమంలో నీ పాత్ర ఏంది? అని ఆమె ప్రశ్నించారు. పాడి కౌశిక్ గెలిచింది.. నీ బిడ్డ..నీ భర్త వల్ల అని, నీ దమ్ము ఏందో అందరికీ తెలుసు అని ఆమె అన్నారు. రాహుల్ గాంధీ మీద మాట్లాడేంత పెద్దోడివి కాదని, అడుక్కు తినేటోడికి 60 కూరలు అన్నట్టు… నువ్వెన్ని పార్టీలు మారావని ఆమె వ్యాఖ్యానించారు. 12 మంది కాంగ్రెస్ ఎంఎల్ఏ లు కాంగ్రెస్ నుండి వెళ్ళిపోయినప్పుడు ఎందుకు తిట్టలేదు ఇన్ని తిట్లు? అని ఆమె అన్నారు. మమ్మల్ని తిట్టి బీఆర్‌ఎస్‌లో ప్రమోషన్ వస్తది అనుకుంటున్నావు.. మహిళల గురించి మాట్లాడుతున్నావు.. నువ్వు ఓ తల్లికి పుట్టలేదా? అని అన్నారు.

Bhatti Vikramarka : త్వరలో యాదాద్రి ధర్మల్ పవర్ ప్రాజెక్ట్ అందుబాటులోకి వస్తుంది

పీసీసీ అధికార ప్రతినిధి సంధ్యా రెడ్డి మాట్లాడుతూ.. చీరలు..గాజులు.. మాకు కాదు… కేసీఆర్.., కేటీఆర్ కి పంపు.. పార్టీ ఫిరాయింపుల మొదలుపెట్టింది వాళ్ళు.. పాడి కౌశిక్ రెడ్డి కాదు.. పాడే కౌశిక్ రెడ్డి అని మార్చుకో.. వంట చేసిన చేతులు అనుకుంటున్నావు.. పాడే కూడా కడతాం అని వ్యాఖ్యానించారు. పీసీసీ అధికార ప్రతినిధి భవానీ రెడ్డి మాట్లాడుతూ.. మహిళను కించ పరచడం అలవాటు అయ్యిందని, గవర్నర్ నీ అవమణించావు ..సభలో సితక్కని.. అవమానించావని, అదే పార్టీలో పుట్టినట్టు మాట్లాడుతున్నావన్నారు. నువ్వు బీఆర్‌ఎస్‌లో ఆటలో అరటిపండు లాంటి వాడివి అని, ఊర్లో వీధి నాటకాల్లో బుడ్డర్ ఖాన్ పాత్ర కౌశిక్ ది అని ఆమె అన్నారు.

Show comments