Congress: పీవీ నరసింహారావుకి భారతరత్న ప్రకటనపై కాంగ్రెస్ రియాక్షన్ ఇది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇద్దరు మాజీ ప్రధానులు పీవీ.నరసింహారావు (PV Narasimha Rao), చరణ్ సింగ్ (Charan Singh), ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌కు శుక్రవారం కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించింది. ఈ సందర్భంగా కేంద్ర నిర్ణయాన్ని దేశ వ్యాప్తంగా ఆయా పార్టీలు స్వాగతించాయి. ఇక పీవీ.నరసింహారావుకి భారతరత్న ప్రకటించడంపై కాంగ్రెస్ అగ్ర నేతలు కూడా స్పందించారు.
సోనియాగాంధీ..
పీవీ.నరసింహారావుకి భారతరత్న ఇవ్వడంపై సోనియాగాంధీ (Sonia Gandhi) స్పందించారు. పార్లమెంట్ నుంచి బయటకు వచ్చినప్పుడు మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. కేంద్ర నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ఆమె తెలిపారు. పీవీ నరసింహారావు, చరణ్‌సింగ్, ఎంఎస్ స్వామినాథన్‌కి భారతరత్న ప్రకటించడంపై సంతోషం వ్యక్తం చేశారు.
Also Read
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
- Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్‌లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్..
జైరాం రమేష్..
పీవీ నరసింహారావు, చరణ్‌సింగ్, ఎంఎస్ స్వామినాథన్‌లు ఎప్పటికీ వారు భారతదేశపు రత్నాలేనని కాంగ్రెస్ (Congress) పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ (Jairam Ramesh) కొనియాడారు. దేశానికి వారు అందించిన సేవలు అపూర్వమని.. ప్రతీ భారతీయుడు వారిని గౌరవిస్తాడని తెలిపారు. డా.స్వామినాథన్ ఫార్ములా (MSP formula) ఆధారంగా రైతులకు కనీస మద్దతు ధర కల్పించే విషయంలో ప్రధాని మోడీ ప్రభుత్వం మౌనం వహిస్తోందని జైరాం రమేశ్ విమర్శించారు. ప్రధాని మోడీ మొండివైఖరి వల్ల ఉద్యమ సమయంలో 700 మంది రైతులు అమరులయ్యారని, కేంద్ర ప్రభుత్వం వ్యవసాయదారులకు ఇచ్చిన హామీని తుంగలో తొక్కిందని జైరాం రమేష్ ధ్వజమెత్తారు.
మల్లిఖార్జున ఖర్గే..
పీవీ నరసింహారావు, చరణ్‌సింగ్, ఎంఎస్ స్వామినాథన్‌లకు కేంద్రం భారతరత్న ప్రకటించడంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే స్వాగతించారు.
తాజావార్తలు
-
Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
-
Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
-
Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్‌లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
-
Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
-
Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!