NTV Telugu Site icon

Telangana Exit Polls 2023: ఇండియా టుడే ఎగ్జిట్‌ పోల్స్‌.. తెలంగాణలో కాంగ్రెస్‌దే అధికారం

Congress

Congress

Telangana Exit Polls 2023: కేసీఆర్ హ్యాట్రిక్ ఆశలను వమ్ము చేస్తూ తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. తెలంగాణలో కాంగ్రెస్ 63–73 స్థానాలతో విజయం సాధించే అవకాశం ఉందని ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ శుక్రవారం అంచనా వేసింది. కాంగ్రెస్ 42 శాతం ఓట్లతో గెలుపొందనుందని, కె చంద్రశేఖర్ రావు (కేసీఆర్) నేతృత్వంలోని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) 119 అసెంబ్లీలలో 34-44 సీట్లు గెలుచుకోవచ్చని అంచనా వేసింది ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్. అంచనా వేసిన ఓట్ల శాతం ప్రకారం బీఆర్‌ఎస్‌కు 36 శాతం ఓట్లు రాగా, బీజేపీకి 14 శాతం ఓట్లు మాత్రమే వస్తాయి. అంతేకాకుండా బీజేపీకి 4-8 సీట్లు, ఇతర స్వతంత్ర అభ్యర్థులకు 5-8 సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్ వెల్లడించింది.గురువారం సాయంత్రం విడుదలైన ఎగ్జిట్‌ పోల్స్‌ కూడా కాంగ్రెస్‌దే విజయం అని అంచనా వేయడం గమనార్హం.

ఇండియా టుడే-మై యాక్సిస్ ఎగ్జిట్‌ పోల్స్‌
• కాంగ్రెస్‌: 63–73
• బీఆర్ఎస్: 34-44
• ఎంఐఎం-6
• బీజేపీ: 4-8

ఓట్ల శాతం
• 42% కాంగ్రెస్
•36% బీఆర్ఎస్
• 14% బీజేపీ
• 3% ఎంఐఎం
• 5 % ఇతరులు

——-
ఉత్తర తెలంగాణ(మొత్తం స్థానాలు-33)
బీఆర్ఎస్ -13,
కాంగ్రెస్ -15,
బీజేపీ-5

మధ్య తెలంగాణ: 31 స్థానాలు
బీఆర్ఎస్-9,
కాంగ్రెస్-22,

హైదరాబాద్: 21 స్థానాలు
బీఆర్ఎస్ -11,
కాంగ్రెస్ -3,
ఎంఐఎం-6,
బీజేపీ-1

మధ్య తెలంగాణః 34 స్థానాలు
బీఆర్ఎస్- 6,
కాంగ్రెస్-27,
బీజేపీ-1