Site icon NTV Telugu

V.Hanumantha Rao : అప్పుడు అసలు మీ బీజేపీ పార్టీ పుట్టిందా..?

V Hanumantha Rao

V Hanumantha Rao

తెలంగాణలో రోజు రోజుకూ రాజకీయం వేడెక్కుతోంది. అయితే.. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇప్పుడు తెలంగాణ రాజకీయం దాని చుట్టే తిరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగీ కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు వి.హనుమంత రావు మాట్లాడుతూ.. సాయుధపోరాటంలో మేము తప్ప ఎవరూ చేయలేనట్టు బీజేపీ కొత్త డ్రామా ఆడుతుందని ఆయన విమర్శించారు. అంతేకాకుండా.. మీరు సాయుధపోరాటంలో ఎక్కడ లేరని, ఉద్యమంలో మేము కమ్మునిస్ట్,ఆర్య సమాజ్ లు మాత్రమే ఉన్నారన్నారు. బీజేపీ వాళ్ళు ఎక్కడపడితే అక్కడ సర్ధార్ పటేల్ బొమ్మలు పెడుతున్నారని, సర్ధార్ పటేల్ ఎవరి ప్రభుత్వంలో హోంమంత్రిగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు.

 

నెహ్రు ఆదేశిస్తే పటేల్ పోలీస్ చర్య చేపట్టారని, మీరు ఏ ఒక్క హామీ అయిన నెరవేర్చరా అని ఆయన మండిపడ్డారు. పాల మీద కూడా జీఎస్టీ వేస్తున్నారని, అప్పుడు అసలు మీ బీజేపీ పార్టీ పుట్టిందా…? అని ఆయన ధ్వజమెత్తారు. పెరిగిన ధరలు, జీఎస్టీపై ప్రజల దృష్టిని మళ్లించడానికి బీజేపీ కొత్త డ్రామా ఆడుతుందని, సర్ధార్ పటేల్ మీ పార్టీ ఆ..? మా ప్రభుత్వంలో హోంమంత్రిగా ఉన్నారు..దానిని కూడా హైజాక్ చేస్తారా…? మీ బీజేపీ లో ఎంత మంది అవినీతి పరులు ఉన్నారు…? ఎంతమంది జైలుకు పంపారు..? అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

Exit mobile version