Renuka Chowdary: తెలంగాణలో కాంగ్రెస్ సునామీ వీస్తోందని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి అన్నారు. ఖమ్మంలో పువ్వాడ ఓడిపోతున్నాడని ధీమా వ్యక్తం చేస్తున్నారు. భయంతో కార్పొరేటర్‌లపై దాడులు, బైండోవర్ కేసులు పెడుతున్నారన్నారు. అధికార మదంతో చట్టవ్యతిరేకమైన చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ కార్యకర్తల జోలికి వస్తే నీ ఇంటికి వచ్చి నిలదీస్తా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓడిపోయిన తక్షణం.. వలస పోతావు పువ్వాడ అంటూ ఆమె మాట్లాడారు.
Also Read: BJP MP Laxman: కాంగ్రెస్, బీఆర్ఎస్ ల డీఎన్ఏలు ఒక్కటే.. వాళ్లకు ఓటేస్తే హోల్ సేల్ గా అమ్ముడు పోతారు..
నాగు పాముకు పాలు పోసి పెంచినా కాటు వేస్తుందని.. అలాగే పువ్వాడకి ఎంత చేసినా పాము లాగానే వ్యవహరిస్తారని విమర్శలు గుప్పించారు. బీజేపీ, బీఆర్‌ఎస్ మిలాకత్ అయ్యాయని ఆమె ఆరోపించారు. ఐటీ దాడులు కాంగ్రెస్ నేతలకు కొత్త కాదన్నారు కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి. ఐటీ వాళ్ళు పిచ్చి వెదవలు అంటూ రేణుక.. ఇళ్లల్లో డబ్బులు పెట్టుకుని ఉంటామా అంటూ వ్యాఖ్యానించారు. పోలీసు కార్లలో డబ్బులు వెళ్తున్నాయని ఆమె ఆరోపణలు చేశారు. కాంగ్రెస్‌లో కోవర్టులు ఉన్నారన్నారు. బీఆర్‌ఎస్ పార్టీలలో మా కోవర్టులు ఉన్నారన్నారు. కాంగ్రెస్ పవర్‌లోకి వస్తే.. బీఆర్‌ఎస్ వాళ్ళ పవర్ కట్ అవుతోంది కదా అంటూ మాట్లాడారు. కేసీఆర్ నిజమే చెప్తున్నారని రేణుక చౌదరి అన్నారు.