Tummala Nageswara Rao : కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం జనవరి 26 నుంచి రాష్ట్ర రైతులకు “రైతు భరోసా” అందించనుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు వెల్లడించారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ , సూర్యాపేట జిల్లా కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు.
ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం విధ్వంసకర పాలన వల్ల నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల ముందు రైతుల్ని మోసం చేయడం కోసం ఔటర్ రింగ్ రోడ్డు తాకట్టు పెట్టి కొంతమంది రైతులకు రైతు బంధు ఇచ్చిందని ఆరోపించారు. పది ఏళ్లుగా రేషన్ కార్డులు కూడా ఇవ్వలేకపోయిన గత ప్రభుత్వం గ్రామ సభలను అడ్డుపడుతుందని మండిపడ్డారు.
Akshay Kumar: ఆ సినిమాల నుంచి నన్ను కావాలనే తప్పించారు: అక్షయ్ కుమార్
రైతులకు రుణమాఫీ చేయడం ద్వారా, రైతు భరోసా అందించడం ద్వారా, అలాగే సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ప్రకటించడం ద్వారా రైతుల ప్రయోజనాల కోసం తమ ప్రభుత్వం పాటుపడుతుందని తుమ్మల పేర్కొన్నారు. ఈ చర్యలపై విమర్శలు చేసే బీఆర్ఎస్ పార్టీ నాయకులు, నల్లగొండలో రైతు దీక్ష నిర్వహించడంపై తుమ్మల ప్రశ్నించారు. గతంలో తమ ప్రభుత్వంలో రుణమాఫీ ఎందుకు చేయలేకపోయారో ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన కోరారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం దొడ్డు బియ్యం మాఫియాతో పాలవుతోందని, ప్రజలకు తినడానికి సన్నబియ్యం అందించడం ద్వారా తమ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం కోసం చర్యలు తీసుకుంటోందని తుమ్మల అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి లక్ష కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకువస్తున్నారంటూ ఆయన ప్రశంసించారు. బీఆర్ఎస్ నాయకులు తమ పదవులు పోతున్న బాధను ప్రజల మీద రుద్దుతున్నారని విమర్శించారు.
రైతులు, ప్రజల గౌరవాన్ని కాపాడే క్రమంలో తమ ప్రభుత్వం ప్రాణాలకు తెగించి పనిచేస్తుందని, ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని తుమ్మల స్పష్టం చేశారు. రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి విధంగా కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. చిల్లర మల్లర రాజకీయాలతో ప్రజలను మభ్యపెట్టకుండా, రైతుల సమస్యలను పరిష్కరించడమే తమ ప్రధాన లక్ష్యమని తుమ్మల నాగేశ్వర్ రావు హితవు పలికారు.
AP Cabinet: వచ్చే నెల 6న ఏపీ కేబినెట్ సమావేశం..