Site icon NTV Telugu

Sonia Gandhi: ఎన్నికల వేళ సోనియా కీలక సందేశం విడుదల

Soej

Soej

దేశ వ్యాప్తంగా మూడో దశ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న వేళ సోనియాగాంధీ కీలక సందేశాన్ని అందించారు. ఇందుకు సంబంధించిన వీడియో కాంగ్రెస్ ఎక్స్ ఖాతాలో పోస్టు చేసింది.

ఇది కూడా చదవండి: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కాలికి గాయం?

మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించి.. దేశంలో ప్రతీ చోట యువత నిరుద్యోగం, మహిళలపై అఘాయిత్యాలు, దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులు, మైనారిటీలు భయంకరమైన వివక్షను ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ పరిస్థితులకు ప్రధాని మోడీనే కారణం అన్నారు. ప్రధాని, బీజేపీ నేతలు.. వారి రాజకీయ లబ్ధి కోసం ద్వేషాన్ని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. అణగారిన వారికి న్యాయం చేయడం కోసం, దేశాన్ని బలోపేతం చేయడం కోసం, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ఇండియా కూటమి ఏర్పడిందని తెలిపారు. ఉజ్వల భవిష్యత్ కోసం.. బలమైన, ఐక్యమైన భారత్ కోసం కాంగ్రెస్‌కు ఓటు వేయాలని దేశ ప్రజలకు సోనియా భావోద్వేగ సందేశం ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. నెట్టింట వైరల్ అవుతోంది.

ఇది కూడా చదవండి: Vote Casting: భాద్యత అంటే ఇదికదా.. చేతులు లేకపోయినా ఓటేసిన వ్యక్తి.. వీడియో వైరల్..

దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే మూడు విడతల పోలింగ్ ముగిసింది. నాల్గో విడత మే 13న జరగనుంది. అనంతరం మే 20, 25, జూన్ 1న పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం జూన్ 4న విడుదల కానున్నాయి. ఇప్పటికే ఆయా పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి.

ఇది కూడా చదవండి: Chandrababu: వచ్చే ఎన్నికలలో ప్రజలు గెలవాలి.. ధర్మం గెలవాలి

Exit mobile version