కాంగ్రెస్ అధ్యక్ష పదవికి అక్టోబర్ 17న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. సెప్టెంబర్ 22న ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు తెలిపాయి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్‌కు ఆమోదం తెలిపేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఇవాళ మధ్యాహ్నం 3న్నర గంటలకు సమావేశమైంది. ఇప్పటికే సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ పార్టీకి రాజీనామా చేయడంతో పాటు పార్టీ నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. వైద్య పరీక్షల కోసం విదేశాలకు వెళ్లిన అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమెకు తోడుగా వెళ్లిన రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ కూడా వర్చువల్‌గా సీడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొన్నారు.
అయితే.. అక్టోబర్ 17న కాంగ్రెస్ పార్టీకి అధ్యక్ష ఎన్నికలు నిర్వహించనున్నట్లు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉంటే.. కన్యాకుమారి నుంచి కశ్మీరు వరకు నిర్వహించనున్న భారత్ జోడో యాత్రకు రాష్ర్టాలవారీగా సమన్వయకర్తలను కాంగ్రెస్ పార్టీ నియమించింది. ఆంధ్రప్రదేశ్‌కు డాలీ శర్మ, తెలంగాణకు ఎస్‌వీ రమణి ఇన్‌చార్జులుగా నియమించినట్టు పార్టీ మీడియా విభాగం అధ్యక్షుడు పవన్ ఖేరా పేర్కొన్నారు.
