హోలీ సెలబ్రేషన్స్ కు రాజకీయ రంగు పులుముకుంది. దేశంలోని పలు ప్రాంతాలలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చిత్రాలతో కూడిన వాటర్ గన్‌లు దర్శనమిచ్చాయి. వీటిని వినియోగిస్తూ జనం హోలీ వేడుకలను జరుపుకుంటున్నారు. అయితే, ఈ వాటర్ గన్‌ల వినియోగంపై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తాజాగా, మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ప్రధాని మోడీ ఫోటో, కమలం గుర్తు కలిగిన వాటర్ గన్‌లు విరివిగా అమ్మకాలు జరుగుతున్నాయి. ఇది కాంగ్రెస్ పార్టీ నేతలను కలవరానికి గురి చేస్తోంది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆర్‌పీ సింగ్ బీజేపీ వైఖరిపై పలు విమర్శలు గుప్పించారు.
Read Also: MixUp : ఓటీటీలో టాప్ ట్రెండింగ్ లో నిలిచిన ఆ బోల్డ్ మూవీ..
ఇక, ప్రజా సమస్యలను పరిష్కరించడం కంటే బ్రాండింగ్‌పై కమలం పార్టీ దృష్టి పెట్టిందని కాంగ్రెస్ నేత ఆర్పీ సింగ్ ఆరోపించారు. మోడీ చిత్రాలతో కూడిన వాటర్ గన్స్, ఇతర హోలీ సామగ్రి తయారీకి అయ్యే ఖర్చును మోడీ ప్రభుత్వం భరిస్తున్నట్లుందని ఆయన పేర్కొన్నారు. తమ పార్టీ నేతలు, కార్యకర్తలు మోడీ చిత్రాలతో కూడిన వాటర్ గన్‌లను వినియోగించరని ఆర్పీ సింగ్ స్పష్టం చేశారు.