NTV Telugu Site icon

Congress: ఏపీలో 6 లోక్సభ, 12 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్

Congress

Congress

Congress Party: దేశవ్యాప్తంగా మరి కొన్ని రోజుల్లో లోక్ సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేస్తుంది. ఇప్పటికే ఎన్నికల్లో పోటీ చేసే పలువురు పేరును విడుదల చేయగా.. ఇవాళ ( మంగళవారం ) మరో ఆరు లోక్ సభ స్థానాలతో పాటు 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అలాగే, కేంద్ర మాజీ మంత్రి కిల్లి క్రుపారాణికి టెక్కలి అసెంబ్లీ టికెట్‌ ను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కేటాయించింది. ఇతర పార్టీల నుంచీ వచ్చిన వారికి అధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఈ జాబితాలో సీనియర్లు, మాజీలు, వలసలకు కాంగ్రెస్ ప్రథమ స్ధానం ఇచ్చింది.

లోక్ సభ అభ్యర్థులు వీరే..
విశాఖపట్నం- పులుసు సత్యనారాయణ రెడ్డి
అనకాపల్లె- వేగి వెంకటేష్
ఏలూరు- SMT. లావణ్య కావూరి
నరసరావుపేట- గార్నెపూడి అలెగ్జాండర్ సుధాకర్
నెల్లూరు- కొప్పుల రాజు
తిరుపతి – DR. చింతా మోహన్

ఎమ్మెల్యే అభ్యర్థులు వీరే..

టెక్కలి- SMT. కిల్లి కృపారాణి
భీమిలి- అడ్డాల వెంకట వర్మ రాజు
విశాఖపట్నం సౌత్- వాసుపల్లి సంతోష్
గాజువాక- లక్కరాజు రామరావు
అరకు లోయ (ST)- సెట్టి గంగాధరస్వామి
నర్సీపట్నం- రుతల శ్రీరామమూర్తి
గోపాలపురం (SC)- సోడదాసి మార్టిన్ లూథర్
యర్రగొండపాలెం(SC)- బూధాల అజిత రావు
పర్చూరు- SMT. నల్లగొర్ల శివ శ్రీలక్ష్మీ జ్యోతి
సంతనూతలపాడు (SC)- విజేష్ రాజ్ పాలపర్తి
గంగాధర నెల్లూరు (SC)- రమేష్ బాబు దెయ్యాల
పూతలపట్టు -(SC) ఎంఎస్ బాబు

Cng

Show comments