NTV Telugu Site icon

PM Modi: కాంగ్రెస్ అంటే దోపిడీ దుకాణం, అబద్ధాల మార్కెట్.. రాజస్థాన్‌ ర్యాలీలో ప్రధాని

Pm Modi

Pm Modi

PM Modi in Rajasthan: రాజస్థాన్‌లోని బికనీర్‌లో తన బహిరంగ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ అంటే దోపిడీ దుకాణం, అబద్ధాల మార్కెట్ అని ప్రధాని మోడీ విమర్శలు గుప్పించారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా కొన్ని నెలల సమయం మాత్రమే ఉన్నందున, గడిచిన తొమ్మిది నెలల్లో ప్రధాని మోదీ రాష్ట్రానికి వెళ్లడం ఇది ఏడో సారి. రాజస్థాన్‌లో జరిగిన ర్యాలీలో ప్రధాని మోడీ అధికారంలో ఉన్న కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. “కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల రాజస్థాన్ రైతులు ఎక్కువగా నష్టపోయారు… రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి, వారు ఏమి చేసారు? 4 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం అంతా తమలో తాము పోట్లాడుకుంటున్నారు. అందరూ ఒకరి కాళ్లు ఒకరు లాగుతున్నారు’ అని ప్రధాని మోడీ శనివారం అన్నారు.

Also Read: Delhi Rains: ఢిల్లీలో వర్ష బీభత్సం.. నీట మునిగిన 56 రోడ్లు..!

రాజస్థాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రానికి హాని మాత్రమే చేసిందని ప్రధాని ఆరోపించారు. “మేము ఢిల్లీ నుంచి రాజస్థాన్‌కు పథకాలను పంపుతాము. రాజస్థాన్ సమస్యలతో, మీ సమస్యలతో కాంగ్రెస్‌కు సంబంధం లేదు. ఇంటింటికీ లబ్ధి చేకూర్చాలన్న బీజేపీ యోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇబ్బంది పడుతోంది. గత కొన్నేళ్లుగా కాంగ్రెస్ రాష్ట్రానికి నష్టం మాత్రమే చేసింది’ అని ప్రధాని మోదీ అన్నారు. రాజస్థాన్‌లో ఉష్ణోగ్రత పెరగడమే కాకుండా.. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో ఆగ్రహ జ్వాలలు పెరిగాయని ఆయన అన్నారు.