కాంగ్రెస్ పార్టీకి చెందిన బీసీ నేతలు మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఇంట్ల సమావేశం అయ్యారు. ఈ మీటింగ్ లో మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య కామెంట్స్… పార్టీలో ఓబీసీ లకు సరైన గుర్తింపు, గౌరవం ఇవ్వాలి అని ఆయన డిమాండ్ చేశారు. బీసీలను విస్మరిస్తే..ఏ రాజకీయ పార్టీ అయినా మనగలగడం కష్టం.. ఈ విషయాన్ని కాంగ్రెస్ కూడా పరిగణనలోకి తీసుకోవాలి.. బీసీలు ఇతర రాజకీయ పార్టీలలో గెలుస్తున్నప్పుడు కాంగ్రెస్ లో ఎందుకు గెలవరు అని ఆయన ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ ఎందుకు బీసీలకు విశ్వాసం కలిగించలేకపోతుంది.. కాంగ్రెస్ అధినాయకత్వం ఆత్మవిమర్శ చేసుకోవాలి అని పొన్నాల అన్నారు.
Read Also: Rashmi Gautam: స్టుపిడ్ అంటూ రెచ్చిపోయిన నెటిజన్.. దిమ్మతిరిగేలా కౌంటరిచ్చిన రష్మీ
బీసీలు బలంగా ఉన్న చోట పార్టీ బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలి అని కాంగ్రెస్ నేత కత్తి వెంకట స్వామి అన్నారు. బీసీలు గెలిచిన అనేక నియోజకవర్గాల్లో బీసీలకే టిక్కెట్ లు ఇవ్వాలి అని డిమాండ్ చేశాడు. మా పార్టీలో బీసీ పెద్దనాయకులకు టిక్కెట్ విషయంలో ఇబ్బంది పెడుతున్నారు.. మా కోటా టిక్కెట్ లు మాకు ఇవ్వాల్సిందే.. బీసీ లీడర్ బలంగా ఉన్న చోట కూడా బీసీలకి అక్కడ టిక్కెట్ ఇవ్వరని కొందరు ప్రచారం చేస్తున్నారు. బీసీలకు పార్టీలో అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని కలుస్తామని అన్నారు. తెలంగాణ ఉధ్యమంలో బీసీలే ముందున్నారు అని కాంగ్రెస్ నేత చెరకు సుధాకర్ వ్యాఖ్యానించారు. బీసీ స్థానాలను గుర్తించి ముందే అభ్యర్థులను ప్రకటించాలి అని ఆయన డిమాండ్ చేశారు.
Read Also: V. Hanumantha Rao: తెలంగాణ రైతులను పట్టించుకోరు గానీ.. బీహార్, పంజాబ్ రైతులకు డబ్బులిచ్చారు
