NTV Telugu Site icon

Oath Ceremony: రేపటి ప్రమాణ స్వీకారోత్సవానికి పెద్ద సంఖ్యలో రానున్న ఇతర రాష్ట్రాల కాంగ్రెస్ ఎంపీలు..

Lb Stadium

Lb Stadium

రేపు ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్ర నేతలతో పాటు, ఇతర రాష్ట్రాల కాంగ్రెస్ ఎంపీలు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు. ఇప్పటికే ఢిల్లీలో ఉన్న రేవంత్ రెడ్డి.. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీలను ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆహ్వానించారు. ఈ క్రమంలో.. రేపు మధ్యహ్నం 1. 04 గంటలకు ఎల్బీ స్టేడియంలో ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. రేవంత్ రెడ్డితో గవర్నర్ తమిళిసై సౌందర్యరజన్ ప్రమాణం చేయించనున్నారు. ఇకపోతే.. రేవంత్ రెడ్డితో పాటు మరికొంత మంది మంత్రులు కూడా ప్రమాణం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Read Also: Bussiness Idea : అదిరిపోయే బిజినెస్ ఐడియా.. పాస్ట్ ఫుడ్ బిజినెస్ తో కళ్లు చెదిరే లాభాలు…

మరోవైపు.. ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి సంబంధించి ఎల్బీ స్టేడియంలో మూడు స్టేజీలు ఏర్పాటు చేశారు. ప్రధాన వేదికపై సీఎం, ఎమ్మెల్యేలు, పీఏసీ, పీఈసీ సభ్యులు ఉండేలా.. రెండో స్టేజీలో ఏఐసీసీ నేతలు.. మూడో స్టేజీపై డీసీసీ అధ్యక్షులు, పార్టీ ముఖ్య నేతలు కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా.. ఎల్బీ స్టేడియం బయట ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఎల్బీ స్టేడియం ప్రధాన ద్వారం దగ్గర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 500 మంది కళాకారులచే అతిధులకు స్వాగతం పలికే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

Read Also: Cyclone Michaung: విరిగిపడుతున్న కొండచరియలు.. అరకులోయ ఘాట్‌ రోడ్డు మూసివేత

ఇదిలా ఉంటే.. రేవంత్ రెడ్డి ఇంకా ఢిల్లీలోనే ఉన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నేతలతో భేటీ అయిన రేవంత్‌రెడ్డి.. అన్నీ పనులు ముగించుకుని ఎయిర్ పోర్టుకు చేరుకోగా, హైకమాండ్ పిలుపుతో ఎయిర్ పోర్ట్ నుంచి మళ్లీ వెనక్కి వెళ్లారు.

 

Show comments