NTV Telugu Site icon

Rahul Gandhi: ప్రధాని మోడీకి రాహుల్ లేఖ.. దేనికోసమంటే..!

Rahul

Rahul

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రధాని మోడీకి (PM Modi) లేఖ రాశారు. పశ్చిమ బెంగాల్‌లో ఉన్న MGREGS కార్మికులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈమేరకు ప్రధానికి రాహుల్ లేఖ పంపించారు.

 

లేఖలో ఏముందంటే..
ఇటీవల భారత్ జోడో న్యాయ యాత్రలో భాగంగా పశ్చిమ బెంగాల్ పర్యటించినట్లు తెలిపారు. యాత్రలో భాగంగా MGREGS (మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం) కార్మికుల దుస్థితిని తెలుసుకున్నట్లు తెలిపారు. వాళ్ల పరిస్థితి భయంకరంగా ఉందన్నారు. మార్చి నుంచి పశ్చిమ బెంగాల్‌కు కేంద్ర నిధులు నిలిపివేయడం వల్ల లక్షల మంది సోదరులు, సోదరీమణులకు MGREGS కింద పని వేతనాలు అందలేదని గుర్తుచేశారు. దీంతో వారి పరిస్థితి దుర్భరంగా ఉందని పేర్కొన్నారు.

న్యాయం కోసం MGREGS కార్మికులు అలుపెరగని పోరాటం చేస్తున్నారని తెలిపారు. కార్మికుల పడుతున్న ఇబ్బందుల గురించి పశ్చిమ్ బంగా ఖేత్ మజ్దూర్ సమిటీ తనకు తెలియజేసిందని.. వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివరించిందని పేర్కొన్నారు. తక్షణమే కేంద్ర నిధులు విడుదల చేసి కార్మికులను ఆదుకోవాలని ప్రధాని మోడీని లేఖ ద్వారా రాహుల్ కోరారు.

 

Show comments