NTV Telugu Site icon

Rahul Gandhi: రాజ్యాంగం ప్రతిని చేతితో పట్టుకుని ఎంపీగా రాహుల్ ప్రమాణం

Ewjw]

Ewjw]

పార్లమెంట్‌లో ఎంపీల ప్రమాణస్వీకారం కొనసాగుతోంది. సోమవారం ప్రధాని మోడీ, కేబినెట్ మంత్రులు ప్రమాణం చేయగా.. మంగళవారం మిగతా ఎంపీల ప్రమాణస్వీకారం కొనసాగుతోంది. ఇక కాంగ్రెస్ అగ్ర నేత, రాయ్‌బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ ప్రమాణం చేశారు. ఆయన పేరు పిలవగానే.. సహచర ఇండియా కూటమి ఎంపీలంతా బల్లలు చరిచి మద్దతు పలికారు. ఇక రాహుల్ ప్రమాణం చేసే ముందు రాజ్యాంగం ప్రతిని చేతితో పట్టుకుని కొద్దిసేపు ప్రదర్శనగా చూపించారు. అనంతరం ప్రొటెం స్పీకర్.. రాహుల్‌చే ప్రమాణం చేయించారు. ప్రమాణం పూర్తి కాగానే జై రాజ్యాంగం అంటూ నినాదం చేశారు. ఇండియా కూటమి ఎంపీలంతా ఇదే రీతిలో రాజ్యాంగం ప్రతిని చేతితో పట్టుకుని ప్రమాణం చేయడం విశేషం.

ఇదిలా ఉంటే ప్రమాణం పూర్తి కాగానే.. ప్రొటెం స్పీకర్‌ను కలవకుండానే కిందకి దిగి వెళ్లిపోతుంటే.. సహచర ఎంపీల సూచనతో మళ్లీ స్పీకర్ సీటు దగ్గరకు వెళ్లి షేక్ హ్యాండ్ ఇచ్చి వచ్చారు. అనంతరం రిజిస్టర్‌లో సంతకం చేసి కూర్చున్నారు.

లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ వయనాడ్, రాయ్‌బరేలీ నుంచి పోటీ చేసి భారీ విజయంతో రెండు స్థానాల్లో గెలిచారు. ఇక వయనాడ్ స్థానాన్ని వదులకుని రాయ్‌బరేలీ స్థానంలో కొనసాగుతున్నారు. ఇక వయనాడ్ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేస్తున్నారు. ఇదిలా ఉంటే లోక్‌సభలో స్పీకర్ పోస్టుకు ఇండియా కూటమి కూడా పోటీ చేస్తోంది. దీంతో బుధవారం స్పీకర్ ఎన్నికకు అనివార్యంగా పోటీ ఏర్పడింది. డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తే మాత్రం.. స్పీకర్ పోస్టుకు పోటీ చేయమని తెలిపింది.