Imran Masood:బీహార్ ఎన్నికల పోరులో కొత్త పంచాయతీ మొదలైంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ దేశభక్తుడు, విప్లవకారుడు భగత్ సింగ్‌ను తీవ్రవాద ఇస్లామిక్ సంస్థ హమాస్‌తో పోల్చడం బీహార్‌లో కొత్త వివాదానికి దారితీసింది. ఆయన ప్రకటనపై బీజేపీ ఎదురు దాడి చేయడం ప్రారంభించింది. బీజేపీ దాడి తరువాత మసూద్ తన ప్రకటనపై వెనక్కి తగ్గాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను ఎప్పుడూ అలాంటి పోలిక చేయలేదని, భగత్ సింగ్ “షహీద్-ఎ-ఆజం” అని, ఆయనను ఎవరితోనూ పోల్చలేనని చెప్పాడు.
READ ALSO: Madhuri : వాడు పశువుతో సమానం.. భరణితో ట్రోల్స్ పై స్పందించిన మాధురి..
అసలు ఏమైందంటే..
బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ .. భగత్ సింగ్‌ను హమాస్‌లతో పోల్చారని బీజేపీ ఐటీ విభాగాధిపతి అమిత్ మాల్వియా ఆరోపించారు. మాల్వియా తన X హ్యాండిల్‌లో మసూద్ భగత్ సింగ్‌ను హమాస్‌తో పోల్చారని పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా మాల్వియా మాట్లాడుతూ.. బీహార్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ భగత్ సింగ్‌ను ఉగ్రవాద సంస్థ హమాస్‌తో పోల్చడం ప్రణాళికాబద్ధమైన వ్యూహంలో భాగమని ఆరోపించారు. ఇది బీహార్ ప్రజలను అవమానించడమేనని, ఈ సాహసానికి ఇమ్రాన్ మసూద్ క్షమాపణలు చెబుతారా లేదా అని ప్రశ్నించారు.
ఈ విమర్శలపై మసూద్ స్పందిస్తూ.. “భగత్ సింగ్‌ను ఎవరితోనూ పోల్చలేము. బీజేపీ ఇలాంటి అంశాలను లేవనెత్తడానికి, ప్రజల మధ్య చిచ్చుపెట్టడానికి ప్రయత్నిస్తుంది. భగత్ సింగ్ మన కోసం పోరాడినట్లే, హమాస్ తన భూమి కోసం పోరాడుతోందని మాత్రమే నేను చెప్పాను…” అని ఆయన వెల్లడించారు. “నేను నన్ను ఎప్పుడూ ఎవరితోనూ పోల్చుకోలేదు, కచ్చితంగా భగత్ సింగ్ తోనూ పోల్చుకోలేదు. భగత్ సింగ్ ఒక ‘షహీద్-ఎ-ఆజం’ ఆయన భావజాలం భిన్నంగా ఉంటుంది” చెప్పారు. ఆయన స్పందన బీహార్ ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.
READ ALSO: Hydra Operation: మెడ్చల్ జిల్లా దేవరాయంజల్‌లో అక్రమ నిర్మాణాలు కూల్చేస్తున్న హైడ్రా !
