Site icon NTV Telugu

Congress MP On Yogi: యోగి కాషాయ దుస్తులపై కాంగ్రెస్ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

Yogi Adityanath

Yogi Adityanath

Congress MP On Yogi: మహారాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ హుస్సేన్ దల్వాయ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కాషాయ దుస్తులు ధరించడంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. “ప్రతిరోజూ మతం గురించి మాట్లాడకండి, కాషాయ దుస్తులు వేసుకోకండి, కొంచెం ఆధునికంగా మారండి. ఆధునిక ఆలోచనలను స్వీకరించండి” అని హుస్సేన్ దల్వాయ్ అన్నారు. ఆదిత్యనాథ్ తన రాష్ట్రంలో వ్యాపారాన్ని ఆకర్షించాలంటే ఆధునిక దుస్తులను ధరించడం ప్రారంభించాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీపై విమర్శలు చేశారు.

వచ్చే నెలలో లక్నోలో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు ముందు దేశీయ పెట్టుబడిదారులను ఆకర్షించడానికి రెండు రోజుల ముంబై పర్యటనలో ఉన్న యూపీ సీఎంపై కాంగ్రెస్ నేత తీవ్రంగా విమర్శలు గుప్పించారు. యోగి ఆదిత్యనాథ్ మహారాష్ట్ర నుంచి పరిశ్రమలను తీసుకోకుండా తన సొంత రాష్ట్రంలో కొత్త పరిశ్రమలను అభివృద్ధి చేయాలని అన్నారు. ‘మహారాష్ట్ర పరిశ్రమలకు మంచి సౌకర్యాలు కల్పించిందని, కాబట్టి మహారాష్ట్ర నుంచి పరిశ్రమలను తీసుకోకుండా రాష్ట్రంలో కొత్త పరిశ్రమలను అభివృద్ధి చేయాలని.. అవి అభివృద్ధి చెందే వాతావరణం కల్పించాలని’ బుధవారం విలేకరులతో అన్నారు. పరిశ్రమ ఆధునికతకు ప్రతీక అని యూపీ సీఎం కొంత ఆధునికతను అలవర్చుకోవాలని ఆయన అన్నారు.

గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (GIS 2023)కి విదేశీ పెట్టుబడిదారులను ఆహ్వానించడానికి, తన మంత్రులు, అధికారుల బృందం రాష్ట్రంలో వివిధ రంగాలలో ఉన్న అవకాశాలను వారికి వివరిస్తు్న్నారు. ఉత్తరప్రదేశ్‌ను ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడానికి, రాష్ట్రానికి భారీగా దేశీయ పెట్టుబడులను తీసుకురావడానికి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వయంగా ఇప్పుడు బాధ్యతలు చేపట్టారు. డిసెంబర్‌లో సీఎం యోగి మార్గదర్శకత్వంలో ఎనిమిది మంది మంత్రులు, ఉన్నతాధికారులు 16 దేశాల్లోని 21 నగరాల్లో పర్యటించి రూ. 7.12 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలను స్వీకరించడం గమనార్హం.

Suryanarayana Raju: బీజేపీకి ఎవరూ రాజీనామా చేయలేదు..

కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. ఆ పార్టీ నేత రామ్ కదమ్ దల్వార్ మాట్లాడుతూ.. ‘‘ హిందూ మతానికి పవిత్ర రంగు అయిన కాషాయంపై కాంగ్రెస్ నాయకులకు, ఆ పార్టీకి ఎందుకు అంత ద్వేషం’’ అని ప్రశ్నించారు. కాషాయ రంగు మన జెండా, ఋషులు, సాధువుల దుస్తుల రంగు మాత్రమే కాదు. ఇది త్యాగం, సేవ, జ్ఞానం, స్వచ్ఛత, ఆధ్యాత్మికతకు చిహ్నం’’ అని అన్నారు. కాంగ్రెస్ నాయకుడి ప్రకటన కాషాయ వేషధారణతో ఉన్న దేశ దార్శనికులను, సాధువులను అవమానించడమే అవుతుందని తెలిపారు.

Exit mobile version