ఉప్పల్ నియోజవర్గం కాప్రాలోని సాయిబాబా కాలనీలో జరిగిన కార్నర్ మీటింగ్ లో కాంగ్రెస్ పార్టీ మల్కాజ్‌గిరి పార్లమెంట్ అభ్యర్థి పట్నం సునీతా మహేందర్ రెడ్డి, మైనంపల్లి హనుమంతరావు, ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి, కార్పొరేటర్ స్వర్ణ రాజ్, సింగిరెడ్డి ధన్ పాల్ రెడ్డి, డివిజన్ కోర్డినేటర్ సీతారాం రెడ్డి, డివిజన్ అధ్యక్షులు నాగశేషు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి గెలుపుతోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాల ప్రజలకు ఇబ్బంది లేని సంక్షేమ పాలన సాధ్యమన్నారు.
Read Also: Kakarla Suresh: కాకర్ల సురేష్కి మద్దతుగా కుటుంబ సభ్యుల ప్రచారం..
అయితే, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను సక్సెస్ ఫుల్ గా అమలు చేస్తుందని మల్కాజ్‌గిరి పార్లమెంట్ అభ్యర్థి పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. ఇతర పార్టీల నాయకులు, అభ్యర్థులు చెప్పే మాయ మాటలు నమ్మి ఓటేసి ప్రజలు మోసపోవద్దన్నారు. దేశంలో రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి కావాలంటే మల్కాజ్ గిరి పార్లమెంట్ లో తనను గెలిపించాలని ఆమె కోరారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఒక్కటే.. అసత్య ప్రచారం చేస్తూ.. ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.