NTV Telugu Site icon

Sucharita Mohanty: కాంగ్రెస్ నిధులు ఇవ్వడం లేదు.. అందుకే ఎన్నికల్లో పోటీ చేయడం లేదు..

Puri

Puri

ఒడిశాలోని పూరీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి సుచరిత మొహంతి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిరాకరించారు. ఇవాళ (శనివారం) కాంగ్రెస్ పార్టీ నిధులు ఇవ్వలేక పోయినందు వల్లే ఎంపీ టిక్కెట్‌ను తిరిగి ఇచ్చాను అని పేర్కొన్నారు. అలాగే, 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొన్ని స్థానాల్లో గెలిచే అభ్యర్థులకు టిక్కెట్లు ఇవ్వకపోవడమే రెండో కారణం అని ఆమె తెలిపారు.

Read Also: Droupadi Murmu: హిమాచల్‌ప్రదేశ్‌లో రాష్ట్రపతి వేసవి విడిది.. గవర్నర్, సీఎం స్వాగతం

ఇక, కాంగ్రెస్‌లో కొంత మంది బలహీన అభ్యర్థులకు టిక్కెట్‌ వచ్చిందని సుచరిత మొహంతి చెప్పుకొచ్చారు. ఇక, పూరీ నుంచి సంబిత్ పాత్రను బీజేపీ తన ఎంపీ అభ్యర్థిగా పోటీలో నిలిపింది. అలాగే, బీజేపీ, బీజేడీ డబ్బు పర్వతాల మీద కూర్చున్నారు.. నా దగ్గర నిధులు లేవు.. పార్టీని అడిగితే వారు స్పందించలేదు.. అది నాకు కష్టంగా మారింది.. ప్రతిచోటా నిధులను ఇష్టం వచ్చినట్లు పంచడం వల్లే ఈ పరిస్థితి ఏర్పాడిందని ఆమె వెల్లడించారు.

Read Also: Dharmapuri Arvind: త్వరలో కాంగ్రెస్ సర్కార్ కూలిపోవడం ఖాయం.. అరవింద్ కీలక వ్యాఖ్యలు

అలాగే, సుచరిత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్) కేసీ వేణుగోపాల్ నిధుల కొరతపై లేఖ రాస్తూ.. పార్టీ నిధులు ఇవ్వడానికి నిరాకరించినందున పూరీ పార్లమెంటరీ నియోజకవర్గంలో మా ప్రచారానికి తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. ఇక, పార్టీ నిధులు ఇవ్వాలని అభ్యర్థించారు.. నేను సొంతంగా నిధులు సేకరించలేను అని వారికి చెప్పినట్లు మొహంతి చెప్పారు. కాబట్టే, పూరీ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేయడం నాకు కష్టమని అధిష్టానానికి చెప్పుకొచ్చాను అని సుచరిత పేర్కొన్నారు.