NTV Telugu Site icon

Congress: ప్రధాని మోడీపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు.. కంప్లైంట్‌‌లో ఏముందంటే..!

Modi

Modi

దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఫీవర్ నడుస్తోంది. అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. అలాగే ఆయా పార్టీలు కూడా ఎన్నికల మేనిఫెస్టోలు ప్రకటిస్తున్నాయి. మరికొన్ని పార్టీలు మేనిఫెస్టో తయారు చేస్తున్నాయి. అయితే ఇటీవలే కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేసింది. దీనిపై ప్రధాని మోడీ విమర్శలు గుప్పించారు. దీంతో ప్రధానిపై కాంగ్రెస్ ధ్వజమెత్తింది. మేనిఫెస్టోపై చేసిన వ్యాఖ్యలకు గానూ మోడీపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. ఎన్నికల కమిషన్‌కి సోమవారం ఫిర్యాదు చేసింది. ఈ విషయాన్ని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ ఎక్స్‌ ట్విటర్‌ వేదికగా వెల్లడించారు.

ఇది కూడా చదవండి: AP News: ఏపీలో బదిలీ అయిన ఐఏఎస్ అధికారులకు పోస్టింగులు..

సల్మాన్ ఖుర్షీద్‌, ముకుల్‌ వాస్నిక్‌, పవన్‌ ఖేరా, గుర్దీప్‌ సప్పల్‌లతో కూడిన కాంగ్రెస్‌ బృందం సోమవారం ఎన్నికల కమిషన్‌ను కలిసిందని తెలిపారు. ఈసీకి మొత్తం ఆరు ఫిర్యాదులు ఇవ్వగా.. అందులో రెండు ప్రధానిపై ఉన్నాయని.. ఈసీ తన స్వతంత్రతను ప్రదర్శించాల్సిన సమయం ఆసన్నమైందని జైరాం రమేశ్‌ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోడీ.. కాంగ్రెస్‌ ప్రకటించిన మేనిఫెస్టోపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అది ముస్లిం లీగ్‌ మేనిఫెస్టో మాదిరిగానే కనిపిస్తోందన్నారు. హస్తం పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోలోని ప్రతీ పేజీలో అబద్ధాలే ఉన్నాయని విమర్శించారు. దేశాన్ని ముక్కలు చేసేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోందని.. కాంగ్రెస్‌కు సిద్ధాంతాలు, విధానాలు లేవని మండిపడ్డారు. పార్టీని అవుట్‌సోర్సింగ్‌కు అప్పగించినట్లు కనిపిస్తోందని మోడీ వ్యాఖ్యానించారు.

ఇది కూడా చదవండి: Tollywood Throwback: ఈ ఫొటోలో ఇద్దరు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు, ఒక తమిళ్ స్టార్ హీరో ఉన్నాడు.. ఎవరో గుర్తుపట్టారా?

ప్రధాని వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్‌ మండిపడింది. లోక్‌సభ ఎన్నికల్లో 180 సీట్లను సాధించేందుకు బీజేపీ కష్టపడుతోందని.. ఆ భయంతోనే హిందూ- ముస్లిం కథను తెరపైకి తీసుకొస్తోందని విమర్శనాస్త్రాలు సంధించింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ నాయకుల బృందం మోడీ వ్యాఖ్యలపై ఈసీకి ఫిర్యాదు చేసింది.

ఇది కూడా చదవండి: Vikkatakavi: తొలి తెలంగాణ డిటెక్టివ్ సిరీస్ ‘వికటకవి’ వచ్చేస్తున్నాడు!