NTV Telugu Site icon

MLC Jeevanreddy: కేసీఆర్కు పట్టిన గతే మోడీకి పడుతుంది.. తీవ్ర విమర్శలు

Mlc Jeevan Reddy

Mlc Jeevan Reddy

ప్రధాని మోడీ జగిత్యాల పర్యటనపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రధాన మంత్రి ఎన్నికల కార్యక్రమంలో దేశ అభివృద్ధి కోసం చేసే కార్యక్రమాల గురించి వివరించాలని తెలిపారు. తెలంగాణలో కేసీఆర్ కి ఏ గతి పట్టిందో.. దేశంలో కూడా మోడీకి అదే గతి పడుతుందని ఆరోపించారు. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అకౌంట్ కూడా ఓపెన్ కాదని విమర్శించారు. కేసీఆర్ గారడీ చేసినట్టే మోడీ ప్రజలను మభ్య పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని జీవన్ రెడ్డి మండిపడ్డారు.

HYD Rains: హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో వర్షం.. రిలాక్స్ అవుతున్న ప్రజలు..

పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని జీఓ విడుదల చేశారు.. కానీ ఎక్కడా ఏర్పాటు చేస్తారో చెప్పలేదని ఆయన ప్రశ్నించారు. మూతపడ్డ పరిశ్రమలను తెరిపించవల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది.. షుగర్ ఫ్యాక్టరీ టీడీపీ, బీజేపీ మిత్రపక్షం హయాంలో మూతపడిందని తెలిపారు. మెట్పల్లిలో చక్కెర కర్మాగారాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ అని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. చక్కెర కర్మాగారాన్ని తెరిపించే బాధ్యత కూడా తీసుకుంటానని జీవన్ రెడ్డి తెలిపారు.

Rajesh Danda: 2025లో పాన్ ఇండియా సినిమా.. నిర్మాత రాజేష్ దండా ఇంటర్వ్యూ

కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ అవినీతికి మార్గం సుగమం చేసిందే మోదీనని దుయ్యబట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుస్తుందని కవిత అరెస్ట్ ను వాయిదా వేశారని మండిపడ్డారు. యావత్ ప్రపంచంలో 100 రోజుల్లో చెప్పిన హామీలు అమలు చేసిన పార్టీ కేవలం ఒక్క కాంగ్రెస్ పార్టీనేనని జీవన్ రెడ్డి తెలిపారు. ఢిల్లీకి డబ్బులు చేరవేస్తున్నామంటే మీది అంత అసమర్థ ప్రభుత్వమా అని ప్రశ్నించారు. పాకిస్థాన్ తో యుద్ధం చేసింది.. మెడలు వంచింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. రజాకార్లతో కొట్లాడినప్పుడు నీ పార్టీ ఎక్కడ ఉన్నది.. మీరు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు.

Show comments