Site icon NTV Telugu

Sridhar Babu: మంథనిలో కేసీఆర్ ప్రోత్సహంతో రౌడీయిజం గూండాయిజం

Sridhar Babu

Sridhar Babu

మంథని చౌరస్తాలో నడి రోడ్డుపై నిల్చుంటా బీఆర్ఎస్ నేతలను వచ్చి నన్ను చంపమను అంటూ పోలీసులపై మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న రాత్రి మహాముత్తారంలో ఓడేడు సర్పంచ్ బక్కారావుపై జరిగిన దాడిని ఖండిస్తూ మంథని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. మంథనిలో రౌడీయిజం, గూండాయిజం చేసే సంస్కృతిని ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. పుట్ట మధు గురించి మాట్లాడితే బక్కన్నకు పట్టిన గతే కాంగ్రెస్ నాయకులకు పడుతదని సోషల్ మీడియాలో వార్నింగ్ ఇచ్చిన బీఆర్ఎస్ నేతపై చర్యలు తీసుకోవాలి అని శ్రీధర్ బాబు కోరారు.

Read Also: Elephants Died: జార్ఖండ్‌లో విషాదం.. 33000 వోల్టేజ్ వైర్ తగిలి 5 ఏనుగులు మృతి

మంథని శాంతియుత ఎన్నికల నిర్వహణకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేస్తాము అని ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అన్నారు. ఎన్నికల్లో ఇతర పార్టీల అభ్యర్థులు పోటీ చేయవద్దా అని ముఖ్యమంత్రి కేసీఆర్ ను, ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. బక్కన్న అనే వ్యక్తి ప్రజాస్వామ్య విధానాలపై నమ్మకంతో ఒక గ్రామ సర్పంచిగా ఎన్నుకోబడ్డ వ్యక్తి అంటూ శ్రీధర్ బాబు మండిపడ్డారు. ఇలాంటి చిల్లర రాజకీయాలను వెంటనే ఆపేయ్యండి.. లేదంటే తగిన పరిణామాలను ఎదుర్కొవల్సి వస్తుంది అని శ్రీధర్ బాబు హెచ్చరించారు.

Exit mobile version