NTV Telugu Site icon

Warangal: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

Warangal

Warangal

Warangal: వరంగల్ నగర అభివృద్ధికి సహాయం చేయాలని కోరుతూ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కలిశారు. కిషన్ రెడ్డి ప్రెస్ మీట్ అనంతరం వేద బ్యాంక్వెట్ హాల్ వద్ద ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఆయన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Read also: Dowry Harassment: నవ వధువుకు కట్నం వేధింపులు.. 5 కోట్లు ఇచ్చినా..!

వరంగల్ నగర అభివృద్ధికి సహకరించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కోరానని, రాజకీయాలకు అతీతంగా అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో పాటు, అదనంగా కేంద్రం కూడా నిధులు కేటాయించాలని ఆయన కోరారు. వరంగల్ నగరంలో స్మార్ట్ సిటీ పనులకు కావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలిని కోరారు. పెండింగ్‌లో ఉన్న బిల్లులను తక్షణమే మంజూరు చేయాలని కోరారు.

గతంలో కిషన్ రెడ్డిని కలిసినప్పుడు కూడా వేములవాడ వేయిస్తంభాల గుడిలో వినతిపత్రం ఇచ్చానని.. కానీ, ఎటువంటి స్పందన రాలేదు. ఈసారి అయినా కేంద్రం స్పందించి నిధులు కేటాయిస్తుందనే ఆశిస్తున్నాను. అభివృద్ధి విషయంలో రాజకీయ పార్టీలకు సంబంధం ఉండకూడదని, అందరూ కలిసికట్టుగా సహకరించాలని కోరారు. ఈ అంశంపై కిషన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి. వరంగల్ అభివృద్ధి కోసం అన్ని పార్టీలు కలిసి పనిచేస్తేనే నగరానికి మేలు జరుగుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.