Site icon NTV Telugu

Congress: చిదంబరం కుమారుడిపై కాంగ్రెస్ నేతల ఆగ్రహం.. లోక్‌సభ టిక్కెట్ ఇవ్వొద్దని డిమాండ్

Karthi Chidambaram

Karthi Chidambaram

తమిళనాడు కాంగ్రెస్‌లో అంతర్గత పోరు కొనసాగుతుంది. దీంతో కాంగ్రెస్ మాజీ హోంమంత్రి, పి.చిదంబరం కుమారుడికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలే స్వయంగా ఉద్యమిస్తున్నారు. కార్తీ చిదంబరానికి లోక్ సభ టికెట్ ఇవ్వకూడదని శివగంగై కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఈ స్థానం నుంచి లోక్‌సభ ఎంపీగా కొనసాగుతున్నారు. కాగా, కార్తీ చిదంబరం తండ్రి కూడా శివగంగై నుంచి 7 సార్లు ఎంపీగా పోటీ చేశారు.

Read Also: World Defence Expo : రియాద్ వరల్డ్ డిఫెన్స్ ఎక్స్‌పో.. పాల్గొన్న 75 దేశాలు

అయితే, కార్తీ చిదంబరంకు టికెట్ ఇవ్వకూడదని శనివారం నాడు శివగంగైకు చెందిన కొందరు కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. తమిళనాడులో కాంగ్రెస్, డీఎంకే( అధికార ద్రవిడ మున్నేట్ర కజగం ) మధ్య సీట్ల పంపకాలపై చర్చలు జరుగుతున్న తరుణంలో ఈ రాజకీయ పరిణామం చోటు చేసుకోవడం విశేషం. అయితే, ఈ అసంతృప్త నాయకుల సమావేశానికి కేంద్ర మాజీ మంత్రి ఈఎం సుదర్శన్ నాచియప్పన్ తో పాటు పి చిదంబరం మద్దతుదారులు కూడా పాల్గొన్నారు. ఈ భేటీలో కార్తీ చిదంబరానికి శివగంగై లోక్ సభ అభ్యర్థిత్వానికి వ్యతిరేకంగా తీర్మానం చేశారు. అయితే ఇలాంటి విభేదాలు గతంలో కూడా కొనసాగాయి. అలాగే, 2019లో కూడా కార్తీని రంగంలోకి దింపడాన్ని నాచియప్పన్ వ్యతిరేకించారు.

Exit mobile version