NTV Telugu Site icon

PM Modi: కాంగ్రెస్ మేనిఫెస్టో ఆర్థిక వ్యవస్థకు చాలా ప్రమాదం

Pm Modi

Pm Modi

కాంగ్రెస్ మేనిఫెస్టో‌తో దేశ ఆర్థిక వ్యవస్థకు చాలా ప్రమాదమని ప్రధాని మోడీ తెలిపారు. ఏఎన్‌ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మోడీ మాట్లాడారు. కాంగ్రెస్ చేసిన హామీలతో ప్రజలకు ఒరిగేదేమీలేదని తెలిపారు. బీజేపీ లక్ష్యం మాత్రం వికసిత భారత్ అన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్‌గా తయారు చేస్తామని మోడీ పేర్కొన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో దేశంలోని యువ ఓటర్ల ఆకాంక్షలను విఫలం చేసిందని మండిపడ్డారు. 25 ఏళ్లలోపు వారికి అతిపెద్ద నష్టం జరుగుతుందన్నారు. వికసిత భారత్ కోసం కొత్త ఓటర్లు బీజేపీకి మద్దతు తెలిపాలని విజ్ఞప్తి చేశారు. దేశాభివృద్ధితో ఎక్కువ లాభపడేది.. యువతేనని మోడీ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Ambati Rambabu: సీఎం జగన్ పై దాడిపై అంబటి సంచలన వ్యాఖ్యలు..

వికసిత భారత్ కావాలంటే ప్రతి ఒక్కరూ బీజేపీని.. ఎన్డీఏ కూటమిని బలపర్చాలని మోడీ ప్రజలకు పిలుపునిచ్చారు. బీజేపీ మేనిఫెస్టో.. భవిష్యత్‌కు భరోసా లాంటిది అని పేర్కొన్నారు. భారత్ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారాలంటే ఓటర్లకు ఇదే మంచి సువర్ణావకాశం అన్నారు. ప్రతిపక్షాల మేనిఫెస్టో యువత భవితవ్యాన్ని పాడు చేసే మేనిఫెస్టోలేనని విమర్శించారు. యువత ఆకాంక్షలను పూర్తిగా ధ్వంసం చేసేవేనని స్పష్టం చేశారు. దేశంలో డిజిటల్ విప్లవానికి నాంది పలికినట్లు తెలిపారు. అతి చౌకగా డేటా అందజేస్తున్నట్లు వెల్లడించారు. డిజిటల్ విప్లవంతో యువతరం జీవితాలు బాగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పన్ను చెల్లించేవారి పట్ల గౌరవం ఉండాలన్నారు. ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం ఉన్నందునే పన్నుల వసూళ్లు గణనీయమైన వృద్ధిని సాధించినట్లు తెలిపారు. గత 10 ఏళ్లలో ఐటీఆర్‌ ఫైల్‌ చేసే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని గుర్తుచేశారు. పన్ను వసూళ్లు మూడు రెట్లు పెరిగాయని.. ప్రభుత్వంపై నమ్మకంతోనే ఈ వసూళ్లు పెరిగాయని చెప్పుకొచ్చారు. వసూలు చేయబడిన ప్రతి పన్ను పేదవాళ్ల కోసమే ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. దేశాన్ని బలోపేతం చేసేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధాని పునరుద్ఘాటించారు.

ఇది కూడా చదవండి: Chandrababu: రాష్ట్రానికి నేనే డ్రైవర్‌.. ఆసక్తికర వ్యాఖ్యలు