పాకిస్థాన్‌పై కాంగ్రెస్ ప్రేమ గరిష్ట స్థాయికి చేరుతోందని ప్రధాన మంత్రి నరేంద్రమోడీ అన్నారు. మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. పాకిస్థాన్‌పై కాంగ్రెస్‌కు ప్రేమ ఉందని పునరుద్ఘాటించారు. మన సైన్యంపై ఉగ్రదాడులు దాడి చేస్తుంటే, పాకిస్థాన్ నిర్దోషి అని కాంగ్రెస్ కు చెందిన ఓ మాజీ సీఎం అన్నట్లు పేర్కొన్నారు. ముంబయి ఉగ్రదాడిలో కూడా పాకిస్థాన్ హస్తం లేదని మరో కాంగ్రెస్ నేత చెప్పారని గుర్తు చేశారు.
దేశానికి వ్యతిరేకంగా మాట్లాడటంలో కాంగ్రెస్ నాయకులు పోటీ పడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ వారసత్వాన్ని కాపాడుకోవడానికే.. ఇండియా కూటమి పోటీ చేస్తుందని దుయ్యబట్టారు. ఈ పార్టీలు దేశ ప్రజల విశ్వాసాలను గాని.. దేశ ప్రయోజనాలను గాని పట్టించుకోరన్నారు. ముస్లిం సంపాదనపైన, వారి రిజర్వేషన్లపైన కాంగ్రెస్ దృష్టి ఉందన్నారు. ఏదో ఒక సాకుతో వారి ఆస్తులను దోచుకోవడమే కాకుండా రిజర్వేషన్లను కూడా దోచుకోవాలని చూస్తున్నారన్నారు.
READ MORE: Online Gaming Fraud: ఆన్‌లైన్ గేమ్స్ లో రూ.12 లక్షలు పోగొట్టుకున్నాడు.. చివరకు ఆత్మహత్య..
సభలో మోడీ మాట్లాడుతూ.. “మీ ఒక్క ఓటు భారతదేశాన్ని 5వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా మార్చింది. మీ ఒక్క ఓటు ప్రపంచంలో భారతదేశ ఆధిపత్యాన్ని పెంచింది. మీ ఒక్క ఓటు 70 ఏళ్ల తర్వాత బీజేపీ ప్రభుత్వం ఆర్టికల్ 370ని తొలగించెలా చేసింది. మీ ఒక్క ఓటు గిరిజన కుమార్తెను రాష్ట్రపతిని చేసింది. మీ ఒక్క ఓటు మహిళలకు రిజర్వేషన్ హక్కు కల్పించింది. మీ ఒక్క ఓటు అవినీతిపరులను జైలుకు పంపింది. మీ ఒక్క ఓటు ఉచిత రేషన్, ఉచిత చికిత్సకు హామీ ఇస్తుంది. మీ ఒక్క ఓటు యువత భవిష్యత్తును తీర్చిదిద్దింది. అపారమైన అవకాశాలను సృష్టించింది. మీ ఒక్క ఓటు 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకి తీసుకొచ్చింది. మీ ఒక్క ఓటుకు ఉన్న శక్తిని చూడండి, మీ ఒక్క ఓటు 500 సంవత్సరాల నిరీక్షణకు ముగింపు పలికి రాముడి యొక్క గొప్ప ఆలయాన్ని నిర్మించింది. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే ఇంకా చాలా చేయాల్సి ఉందని పేర్కొన్నారు.”