NTV Telugu Site icon

Warangal Sabha: రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకునే సభ

వరంగల్ హనుమకొండ లోని ఆర్ట్స్ & సైన్స్ కళాశాల మైదానంలో రాహుల్ గాంధీ సభ ఏర్పాట్లను పరిశీలించారు సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ హన్మంతరావు. అనేక ఉద్యమాలు ఓరుగల్లు నుండే పురుడుపోసుకున్నాయి. మే 6వ తేదీన జరిగే సభ.. రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకునే సభ అన్నారు ప్రజలంతా టీఆర్ఎస్ పాలనపై అసహనంతో వున్నారు. వరంగల్ లో జరిగే రైతు సంఘర్షణ సభతో రాజకీయ మార్పు సంభవిస్తుందన్నారు.

ఓట్ బ్యాంకును కాంగ్రెస్ వైపు తిప్పుకోవడం కోసం కార్యాచరణ మొదలైంది. 6 లక్షల మందితో రైతు సంఘర్షణ సభ ఏర్పాటుచేస్తున్నామన్నారు. ఆర్ట్స్ కాలేజీ సభ శుభ సూచికం అన్నారు. మాలో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు. ఉపరాష్ట్రపతి ప్రకటన ఆమోద యోగ్యం. ఒక పార్టీ నుండి గెలిచి మరోపార్టీలోకి మారితే పదవికి రాజీనామా చేయాలనే నిర్ణయంపై పార్లమెంట్ లో చట్టం తేవావాలన్నారు.

బీజేపీ, కేసీఆర్ మాయమాటలతో ప్రజలను మభ్యపెడుతున్నారు. బీజేపీ కేవలం మాటల ప్రభుత్వం. ధరలు పెంచి రోడ్లపై ధర్నాలు చేస్తున్నారు. ఇదెక్కడి న్యాయం? అంతర్జాతీయ మార్కెట్‌తో సంబంధం లేకుండా ప్రజలపై భారం పడకుండా చూడాలి. టీఆర్ఎస్ కు తొత్తులుగా ఉన్న పోలీస్ అధికారులపై మా ప్రభుత్వం వచ్చిన తరువాత తగిన చర్యలు తప్పవని హెచ్చరించారు హనుమంతరావు.

Read Also: Paddy Purchase: ఆర్భాటంగా ప్రారంభం.. కొనుగోళ్ళు శూన్యం