కేంద్ర బడ్జెట్‌పై కాంగ్రెస్ నేత వి. హనుమంతు రావు స్పందించారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. బడ్జెట్ కేటాయింపులు ఎన్డీఏ పాలిత రాష్ట్రాలకే ఎక్కువగా జరిగాయన్నారు. “తెలంగాణలో విభజన హామీలు ఏవీ పూర్తి చేయలేదు. మూసీ ప్రక్షాళన కోసం నిధులు కోరినా కేటాయింపులు జరపలేదు. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలపై కేంద్రం పక్షపాతాన్ని ప్రదర్శిస్తోంది. పోలవరం, అమరావతి, విశాఖ స్టీల్ ప్లాంట్‌కు నిధులిచ్చిన కేంద్రం, తెలంగాణలో ఒక్క ప్రాజెక్టుకు కూడా నిధులు ఇవ్వలేదు. ఇందిరమ్మ పేరు పెడితే ఇళ్లకు కూడా నిధులు ఇవ్వబోమని ఓ నేత అంటున్నారు. ఇది ఈనాటి పథకం కాదు. ఎప్పటి నుంచో కొనసాగుతూ వస్తున్న పథకం. ఎన్నికల వరకే రాజకీయాలు ఉండాలి. గెలిచిన తర్వాత అందరినీ సమానంగా చూడాలి. యూపీఏ ప్రభుత్వ హయాంలో ఇతర పార్టీల పాలిత రాష్ట్రాలపై ఇలాంటి వివక్ష చూపలేదు.” అని పేర్కొన్నారు.
READ MORE: Keerthi Suresh: అప్పటి నుంచి అతని అన్నయ్య అని పిలుస్తున్న : కీర్తి సురేష్
“సబ్ కా సాత్ సబ్ కా వికాస్” అంటూ మోడీ ఇచ్చే స్లోగన్‌కు, ఆచరణకు సంబంధం లేదని హనుమంతు రావు అన్నారు. “తెలంగాణ నుంచి కేంద్రంలో ఇద్దరు మంత్రులున్నా రాష్ట్రానికి అన్యాయం జరుగుతోంది. కేంద్ర బడ్జెట్‌లో బీసీలకు ఎక్కువ నిధులు కేటాయించాలి. దేశంలో కులాలవారిగా జనగణన తక్షణమే చేపట్టాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు సీట్లు పెంచాలి. బడ్జెట్ పెంచాలి.కేంద్ర ప్రభుత్వ పక్షపాత వైఖరికి వ్యతిరేకంగా ధర్నాలు, నిరసనలు చేయాలి.” అని డిమాండ్ చేశారు.
READ MORE: Tata Company : బడ్జెట్ వారంలో భారీ నష్టాలను చవిచూసిన రతన్ టాటా ఫేవరేట్ కంపెనీ